Jawan : షారుఖ్ ఖాన్ ‘జవాన్’ టీజర్ రిలీజ్.. నేను విలన్ అయితే నా ముందు నిలబడే హీరో ఎవడూ లేడు..

తమిళ దర్శకుడు అట్లీ బాలీవుడ్ లో షారుఖ్ హీరోగా జవాన్ సినిమా చేస్తున్నాడు. తాజాగా జవాన్ టీజర్ ని రిలీజ్ చేశారు.

Jawan : షారుఖ్ ఖాన్ ‘జవాన్’ టీజర్ రిలీజ్.. నేను విలన్ అయితే నా ముందు నిలబడే హీరో ఎవడూ లేడు..

Shahrukh Khan Jawan Teaser Released

Jawan Teaser : తమిళ దర్శకుడు అట్లీ బాలీవుడ్ లో షారుఖ్ హీరోగా జవాన్ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో నయనతార హీరోయిన్ గా, విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చివరి దశ షూటింగ్ లో ఉంది. జవాన్ సినిమాని సెప్టెంబర్ 7న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో షారుఖ్ సొంతంగా తన నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ పై నిర్మిస్తున్నాడు.

Project K : ప్రాజెక్ట్ K సినిమా కూడా రెండు పార్ట్స్? బాహుబలి, సలార్ బాటలో ప్రాజెక్ట్ K

ఇటీవల జవాన్ సినిమా పైనుంచి ప్రివ్యూ రిలీజ్ చేస్తామని ప్రకటించారు చిత్రయూనిట్. దీంతో రెండు రోజుల నుంచి షారుఖ్ అభిమానులు ఈ ప్రివ్యూ ఏంటా అని ఎదురు చూస్తున్నారు. తాజాగా జవాన్ టీజర్ ని రిలీజ్ చేశారు. టీజర్ హై లెవల్ లో ఉంది. ఇక ఈ సినిమాలో దీపికా పదుకొనే స్పెషల్ అప్పీరెన్స్ ఇవ్వనుంది. ఇందులో కొంతమంది అమ్మాయిలతో షారుఖ్ పోరాటాలు చేయిస్తున్నట్టు, షారుఖ్ ఆర్మ్ ఆఫీసర్ గా చూపించారు. ఇక చివర్లో షారుఖ్ గుండుతో కనపడి అందర్నీ ఆశ్చర్యపరిచారు. విలన్ గా విజయ్ సేతుపతి మరింత పవర్ ఫుల్ గా చూపించబోతున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి ఈ సినిమాతో అట్లీ బాలీవుడ్ లో విధ్వంసం సృష్టించడానికి రెడీ అవుతున్నాడు. టీజర్ చూశాక సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.