Amazon Prime Day Sale : అమెజాన్ ప్రైమ్ డే సేల్.. ఆపిల్ ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు..!

Amazon Prime Day Sale : ఈ నెలలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెజాన్ ప్రైమ్ డే సేల్‌ మొదలుకానుంది. రాబోయే ప్రైమ్ డే సేల్ (Amazon Prime Day ) జూలై 15 నుంచి జూలై 16 మధ్య జరుగుతుందని ఈ-కామర్స్ ప్లాట్‌ఫాం వెల్లడించింది.

Amazon Prime Day Sale : అమెజాన్ ప్రైమ్ డే సేల్.. ఆపిల్ ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు..!

Apple iPhone 14 will be available with biggest discount of this year during Amazon Prime Day sale

Amazon Prime Day Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) ఈ (జూలై 2023) నెలలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రైమ్ డే సేల్‌ను నిర్వహించనుంది. రాబోయే ప్రైమ్ డే సేల్ జూలై 15 నుంచి జూలై 16 మధ్య జరుగుతుందని ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ వెల్లడించింది. ఈ సేల్ సమయంలో ఆఫర్‌లు ప్రైమ్ వినియోగదారులకు ప్రత్యేకంగా అందుబాటులో ఉంటాయి. కంపెనీ, ఇప్పటికే ఫోన్ కేటగిరీలో కొన్ని ఆఫర్‌లను వెల్లడించింది. అందులో ఆపిల్ ఐఫోన్‌లపై డీల్, వైర్‌లెస్ & హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ కేటగిరీకి చెందిన అమెజాన్ ఇండియా (Amazon India) డైరెక్టర్ రంజిత్ బాబు, ప్రైమ్ డే సేల్‌లో ఐఫోన్ 14 భారీ డిస్కౌంట్ పొందనున్నట్టు వెల్లడించారు.

అత్యుత్తమ ఆఫర్లలో ఐఫోన్ 14పై ప్రత్యేక ఆఫర్ ఉంటుందని వెల్లడించాడు. వాస్తవానికి.. ఐఫోన్ 13 కన్నా ఐఫోన్ 14లో ఆఫర్ చాలా మెరుగ్గా ఉంటుంది. అమెజాన్ ఆఫర్ ధరను ఇంకా వెల్లడించలేదని పేర్కొంది. ఐఫోన్ 14పై డిస్కౌంట్ ఈ ఏడాదిలో ఇప్పటివరకు బెస్ట్ అని చెప్పవచ్చు. ఐఫోన్ 14 కొనుగోలు చేసేందుకు చాలా కాలంగా వేచి చూస్తున్నారా? అయితే ఇదే సరైన సమయం.. అదనంగా, ఐఫోన్లపై అదిరే ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు ఉంటాయని కంపెనీ వెల్లడించింది. ఐఫోన్ 13 మోడల్ పాతది.. ఐఫోన్ 14పై బెస్ట్ డిస్కౌంట్ పొందవచ్చు.

Apple iPhone 14 will be available with biggest discount of this year during Amazon Prime Day sale

Amazon Prime Day sale : Apple iPhone 14 will be available with biggest discount of this year 

Read Also :  Oppo Reno 10 Series : అద్భుతమైన ఫీచర్లతో ఒప్పో రెనో 10 సిరీస్ 5G వచ్చేసింది.. ఒప్పో ఎన్కో ఎయిర్ 3 ప్రో.. ధర ఎంత? సేల్ డేట్ ఎప్పుడంటే?

ఇంతలో, ఐఫోన్ 15 సిరీస్ ఈ ఏడాది చివరలో అధికారికంగా వస్తుందని పుకార్లు సూచిస్తున్నాయి. ప్రతి ఏడాది మాదిరిగా ఆపిల్ ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ చివరిగా, ఐఫోన్ 15 ప్లస్ సహా 4 కొత్త ఐఫోన్ మోడళ్లను ఆవిష్కరించాలని భావిస్తున్నారు. టాప్-ఎండ్ స్పెసిఫికేషన్ల కారణంగా ఐఫోన్ 14 సిరీస్‌తో పోలిస్తే.. రాబోయే ఐఫోన్ మోడల్‌లు అధిక ధరలో ఉండబోతున్నాయని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. ఇప్పుడు, ఎవరైనా పాత ఐఫోన్‌ను అప్‌గ్రేడ్ చేయాలని భావిస్తే.. ఐఫోన్ 14ని కొనుగోలు చేయొచ్చు.

ఐఫోన్ 14 క్లాస్సిగా ఫారమ్ ఫ్యాక్టర్‌లో పవర్‌ఫుల్ స్పెసిఫికేషన్‌లను అందిస్తుంది. ఐఫోన్ మోడల్ సరికొత్త బాక్సీ డిజైన్‌తో వెనుక ప్యానెల్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఫ్రంట్ సైడ్ ఐఫోన్ విస్తృత నాచ్‌ని కలిగి ఉంది. ఇందులో సెల్ఫీ కెమెరా ఉంటుంది. A15 బయోనిక్ చిప్‌సెట్‌తో ఆధారితంగా పనిచేస్తుంది. ఐఫోన్ 14 కూడా ఒకే ఛార్జ్‌తో రోజుంతా వస్తుంది. లేటెస్ట్ iOS ఆపరేటింగ్ సిస్టమ్‌లో రన్ అవుతుంది. మొత్తంమీద, ప్రస్తుతం భారత మార్కెట్లో ఐఫోన్ 14 కొనుగోలుకు బెస్ట్ ఐఫోన్ మోడల్ అని చెప్పవచ్చు. అధికారికంగా ఐఫోన్ మోడల్ భారత మార్కెట్లో రూ.79,900 నుంచి ప్రారంభమవుతుంది.

Read Also : Hyundai Exter Launch : కొంటే ఇలాంటి కారు కొనాలి.. హ్యుందాయ్ ఎక్స్‌టర్‌ వచ్చేసిందోచ్.. ధర కేవలం రూ. 6 లక్షలు మాత్రమే.. త్వరపడండి..!