ఎర్రమట్టి దిబ్బలు జాతీయ వారసత్వ సంపద, కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది- అమర్నాథ్

ఎర్రమట్టి దిబ్బల తవ్వకాల మీద కోర్టులో కేసు వేస్తానని గుడివాడ అమర్నాథ్ తెలిపారు.

ఎర్రమట్టి దిబ్బలు జాతీయ వారసత్వ సంపద, కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది- అమర్నాథ్

Gudivada Amarnath (Photo Credit : Google)

Gudivada Amarnath : ఎర్రమట్టి దిబ్బలు జాతీయ వారసత్వ సంపద అని, వాటిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఎర్రమట్టి దిబ్బల అంశం మీద వ్యక్తిగతంగా పిల్ వేస్తానని ఆయన చెప్పారు. ఎటువంటి అనుమతులు లేకుండా తవ్వకాలు చేస్తున్నారని, నేలను చదును చేసి రోడ్లు వేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎర్రమట్టి దిబ్బల తవ్వకాల మీద కోర్టులో కేసు వేస్తానని గుడివాడ అమర్నాథ్ తెలిపారు.

”వినుకొండ ఘటన దురదృష్టకరం. బాధిత కుటుంబాన్ని వైసీపీ అధినేత జగన్ రేపు పరామర్శిస్తారు. వైసీపీ కార్యకర్తను నడిరోడ్డు మీద నరికేశారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం. ఐదేళ్లు శాసనసభ్యునిగా, మంత్రిగా నేను ఏదైనా అవినీతికి పాల్పడినట్టు రుజువులుంటే విచారణ చేయచ్చు. నేను సిద్ధం. టీడీపీ అధికారంలోకి వచ్చి 45 రోజులు గడుస్తున్నా ఇంకా వైసీపీ మీద అబద్ధాలు మాట్లాడుతున్నారు” అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు.

Also Read : అటు ప్రభుత్వ చర్యలు, ఇటు ప్రజల తిరుగుబాటు.. ప్రమాదంలో వైసీపీ నేత 30ఏళ్ల వ్యాపార సామ్రాజ్యం..!