WI vs IND 1ST Test : వెస్టిండీస్ పేస‌ర్‌ను బూతులు తిట్టిన య‌శ‌స్వి జైశ్వాల్‌..! కోహ్లి రియాక్ష‌న్ ఏంటంటే..?

టీమ్ఇండియా యువ బ్యాట‌ర్ య‌శ‌స్వి జైశ్వాల్ పై ప్ర‌స్తుతం ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. అరంగ్రేటం టెస్టులోనే సెంచ‌రీతో అద‌ర‌గొట్టాడు ఈ యువ ఆట‌గాడు. ఈ కుర్రాడి ఆట‌తీరుడు అంద‌రూ ఫిదా అవుతున్నారు.

WI vs IND 1ST Test : వెస్టిండీస్ పేస‌ర్‌ను బూతులు తిట్టిన య‌శ‌స్వి జైశ్వాల్‌..! కోహ్లి రియాక్ష‌న్ ఏంటంటే..?

Yashasvi Jaiswal Caught Abusing West Indies Pacer

WI vs IND : టీమ్ఇండియా యువ బ్యాట‌ర్ య‌శ‌స్వి జైశ్వాల్ (Yashasvi Jaiswal ) పై ప్ర‌స్తుతం ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. అరంగ్రేటం టెస్టులోనే సెంచ‌రీతో అద‌ర‌గొట్టాడు యువ ఆట‌గాడు. ఈ కుర్రాడి ఆట‌తీరుకు అంద‌రూ ఫిదా అవుతున్నారు. జ‌ట్టు త‌న‌పై ఉంచిన న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేయ‌కుండా త‌న స‌త్తా ఏంటో చూపించాడు. ఈ క్ర‌మంలో ప‌లు రికార్డుల‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. అయితే.. ఈ యువ ఓపెన‌ర్ స‌హ‌నం కోల్పోయాడు. విండీస్ బౌల‌ర్‌పై నోరుపారేసుకున్నాడు. రాయ‌లేని బూతు ప‌దంతో హిందీలో అత‌డిని తిట్టాడు. ఇదంతా స్టంప్ మైక్‌లో రికార్డైంది.

రెండో రోజు ఆట మూడో సెష‌న్‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. భార‌త ఇన్నింగ్స్ 103వ ఓవ‌ర్‌లో విరాట్ కోహ్లి(Virat Kohli), య‌శ‌స్వి జైశ్వాల్ క్రీజులో ఉన్నారు. విండీస్ పేస‌ర్ కీమ‌ర్ రోచ్ (Kemar Roach) త‌న 14వ ఓవ‌ర్‌ని వేస్తున్నాడు. సింగిల్ తీసిన అనంత‌రం జైశ్వాల్ స‌హ‌నం కోల్పోయాడు. ‘నా దారికి అడ్డురాకు.. ల‌… ‘ అంటూ హిందీలో ఓ బూతు ప‌దాన్ని వాడాడు.

Yashasvi Jaiswal : చ‌రిత్ర సృష్టించేందుకు మ‌రో 57 ప‌రుగుల దూరం

జైశ్వాల్ అన్న‌ది విన్న కోహ్లి వెంట‌నే ఏం జ‌రిగింది అంటూ అత‌డిని అడిగాడు. ప‌రుగు తీసే క్ర‌మంలో అత‌డు ప‌దే ప‌దే అడ్డువ‌స్తున్నాడు అని కోహ్లికి జైశ్వాల్ చెప్పాడు. ఎవ‌రు అని రోచ్‌ను ఉద్దేశిస్తూ కోహ్లి అడుగ‌గా అవును అంటూ జైశ్వాల్ స‌మాధానం ఇచ్చాడు. ఈ సంబాష‌ణ మొత్తం స్టంప్ మైక్‌ల‌లో రికార్డు అయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ICC: ఐసీసీ కీల‌క నిర్ణయం.. ఇకపై పురుషుల, మహిళల జట్లకు సమాన ప్రైజ్ మనీ

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. విండీస్ మొద‌టి ఇన్నింగ్స్‌లో 150 ప‌రుగుల‌కు ఆలౌట్ అయ్యింది. రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి భార‌త తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల న‌ష్టానికి 312 ప‌రుగులు చేసింది. ప్ర‌స్తుతం టీమ్ఇండియా 162 ప‌రుగుల ఆధిక్యంలో ఉంది. య‌శ‌స్వి జైశ్వాల్ (143; 350 బంతుల్లో 14ఫోర్లు), విరాట్ కోహ్లి(36; 96 బంతుల్లో 1 ఫోర్‌) లు క్రీజులో ఉన్నారు.