Pakistan Politics: తన పార్టీ రద్దుపై కీలక వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

మే 9న ఇమ్రాన్ అరెస్ట్ సందర్భంగా దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లపై పూర్తి బాధ్యత ఇమ్రాన్ పార్టీపై వేసే ప్రయత్నం జరుగుతోందనే ఆరోపణల వస్తూనే ఉన్నాయి. ప్రభుత్వం దీనిని బూచీగా చూపిస్తూ ఐటీ దాడులు చేయడం, కేసులు వేయడం లాంటివి చేస్తూనే ఉన్నాయి.

Pakistan Politics: తన పార్టీ రద్దుపై కీలక వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మీద తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు విదేశీయులు ఇచ్చిన బహుమతుల విక్రయం కేసులో జైలుకు పంపిన విషయం తెలిసిందే. అయితే ఆయన పార్టీని (పాకిస్తాన్ తెహ్రిక్ ఏ ఇన్సాఫ్) రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆ పార్టీ నేతలు కొంత కాలంగా ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా ఇమ్రాన్ ఖాన్ సైతం అవే ఆరోపణలు చేశారు. అయితే పార్టీ రద్దు చేసుకుంటో చేసుకొమ్మంటూ ఆయన సవాలు విసిరారు. ఆ పార్టీ పోతే తాను ఇంకో పార్టీ పెడతానని, ఆ పార్టీతో అధికారం చేపడతామని ఇమ్రాన్ విశ్వాసం వ్యక్తం చేశారు.

Revanth Reddy : బైబై కేసీఆర్ అంటూ ఉచిత కరెంట్‌పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు : రేవంత్ రెడ్డి

మే 9న ఇమ్రాన్ అరెస్ట్ సందర్భంగా దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లపై పూర్తి బాధ్యత ఇమ్రాన్ పార్టీపై వేసే ప్రయత్నం జరుగుతోందనే ఆరోపణల వస్తూనే ఉన్నాయి. ప్రభుత్వం దీనిని బూచీగా చూపిస్తూ ఐటీ దాడులు చేయడం, కేసులు వేయడం లాంటివి చేస్తూనే ఉన్నాయి. ఇప్పటికే పలువురు పీటీఐ నేతలు అరెస్ట్ అయ్యారు. అందులో కొంత మంది విడుదలయ్యారు, కొందరు ఇంకా కటకటాల వెనుకే ఉన్నారు. ఈ అల్లర్లను ఆధారం చేసుకునే పీటీఐని రద్దు చేయాలని అధికార పార్టీలోని కొందరు డిమాండ్ చేస్తున్నారు.

West Bengal: హత్య కేసులో జైలుకెళ్లిన ఆ ఇద్దరు ప్రేమలో పడ్డారు.. పెరోల్ మీద బయటికి వచ్చి పెళ్లి చేసుకున్నారు

పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి రానా సనాఉల్లా స్పందిస్తూ దేశంలో మామూలు పరిస్థితి రావాలంటే పీటీఐని రద్దు చేయడమే ఏకైక మార్గమని సూచించారు. ఇదే విషయాన్ని రక్షణ శాఖ మంత్రి కూడా వ్యక్తం చేశారు. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధినేత, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి బిలావల్ బుట్టో సైతం ఇదే అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. కాగా, వీరి వ్యాఖ్యలపై ఇమ్రాన్ స్పందిస్తూ ‘‘వాళ్లు మా పార్టీని రద్దు చేస్తే చేయనీయండి. కొత్త పార్టీ పేరు మీద గెలుస్తాం. పోటీ చేయకుండా నాపై నిషేధం విధించినా, నన్ను జైల్లో వేసినా, మా పార్టీ గెలుస్తుంది’’ అని అన్నారు.