Hari Hara Veera Mallu : ఏపీ ఎలక్షన్స్ పైనే మా సినిమా ఆధారపడి ఉంది.. బడ్జెట్ పెరిగింది.. హరిహర వీరమల్లు నిర్మాత AM రత్నం..
ఇప్పటికి హరిహర వీరమల్లు సినిమా కేవలం 50 శాతమే పూర్తయిందని సమాచారం. గత కొన్ని రోజులుగా హరిహర వీరమల్లు సినిమా ఆగిపోయింది, ఇప్పట్లో ఉండదు అని టాక్ నడుస్తుండగా తాజాగా నిర్మాత AM రత్నం ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమాపై క్లారిటీ ఇచ్చారు.
Hari Hara Veera Mallu : వచ్చే సంవత్సరమే ఏపీలో ఎలక్షన్స్ ఉండటంతో పవన్ కళ్యాణ్ తన రాజకీయ యాత్రలతో బిజీగా ఉన్నారు. దీంతో పవన్ సినిమాలకు డేట్స్ ఇవ్వలేకపోతున్నారు. పవన్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. OG, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు. OGకి ఇంకో 20 రోజులు పవన్ డేట్స్ ఇస్తే షూటింగ్ అయిపోతుంది కాబట్టి ఎలాగైనా ఈ సినిమాకి డేట్స్ ఇస్తారు. కానీ ఉస్తాద్ అసలు షూటింగ్ పూర్తిగా మొదలవ్వలేదు. ఏదో పది శాతం షూట్ చేశారు అది కూడా టీజర్ కోసమే చేశారని టాక్. ఈ సినిమాకి చాలా డేట్స్ ఇవ్వాలి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఇవ్వడం చాలా కష్టం.
ఇక హరిహర వీరమల్లు సినిమా అనౌన్స్ చేసి మూడేళ్లు అవుతుంది. మొదట కరోనా వల్ల ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఆ తర్వాత పవన్ రాజకీయ షెడ్యూల్స్ వల్ల వాయిదా పడుతూ వస్తుంది. ఖుషి నిర్మాత AM రత్నం నిర్మాణంలో క్రిష్ దర్శకత్వంలో భారీగా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతుంది. ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ యాక్టర్స్ బాబీ డియోల్, నోరా ఫతేహి.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఫస్ట్ పాన్ ఇండియా సినిమా కావడం, పవన్ మొదటి పీరియాడికల్ సినిమా కావడంతో అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.
ఇప్పటికి హరిహర వీరమల్లు సినిమా కేవలం 50 శాతమే పూర్తయిందని సమాచారం. గత కొన్ని రోజులుగా హరిహర వీరమల్లు సినిమా ఆగిపోయింది, ఇప్పట్లో ఉండదు అని టాక్ నడుస్తుండగా తాజాగా నిర్మాత AM రత్నం ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమాపై క్లారిటీ ఇచ్చారు.
AM రత్నం మాట్లాడుతూ.. హరిహర వీరమల్లు సినిమా ఆగిపోలేదు. ఏపీలో ఎలక్షన్స్ షెడ్యూల్ ప్రకారం జరిగితే హరిహర వీరమల్లు వచ్చే నెల ఆగస్టు నుంచి షూటింగ్ మొదలవుతుంది. ఒకవేళ ఎలక్షన్స్ ముందుకి వస్తే మాత్రం సినిమా ఎలక్షన్స్ అయిన తర్వాత ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి రాజకీయ పరిస్థితులని మేము అర్ధం చేసుకోగలం. ఆయన ప్రజలకు మంచి చేయడానికి వెళ్తున్నారు కాబట్టి ఇలాంటి ఇబ్బందులు తప్పవు. ఆయన మాకు మాట ఇచ్చారు, రెగ్యులర్ గా టచ్ లో ఉంటారు. సినిమాని పూర్తి చేస్తారు అని తెలిపారు.
Vaishnavi Chaitanya : ‘బేబీ’ సినిమాలో బోల్డ్ సీన్స్ పై స్పందించిన వైష్ణవి చైతన్య.. ఏముందో తెలుసా?
అలాగే.. హరిహర వీరమల్లు సినిమా దాదాపు 60 శాతం షూటింగ్ పూర్తయింది. సినిమా బడ్జెట్ ముందు అనుకున్న దాని కంటే కొంచెం పెరిగింది. కానీ ఇది పాన్ ఇండియా సినిమా కాబట్టి మాకు భయం లేదు. కంటెంట్ కూడా చాలా గ్రాండ్ గా ఉంటుంది. పవన్ వేరే సినిమాలకి డేట్స్ ఇవ్వడానికి కారణం వాళ్ళకి తక్కువ డేట్స్ సరిపోతాయి. మా సినిమాకు ఇంకా చాలా డేట్స్ కావాలి అందుకే పవన్ మా కంటే ముందు వేరే సినిమాలకు డేట్స్ ఇస్తున్నారు. దీంట్లో మాకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదు అని తెలిపారు. దీంతో ఇన్నాళ్లు ఆగిపోయింది అనుకున్న హరిహర వీరమల్లు సినిమాపై నిర్మాత క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు హమ్మయ్య ఈ పాన్ ఇండియా సినిమా ఉంది అని సంతోషిస్తున్నారు.