Singapore Politics: సింగపూర్ పార్లమెంట్ స్పీకర్, మంత్రి రాజీనామా.. ఇద్దరి మధ్య అనుచిత సంబంధమే కారణం

ఈ ఇద్దరు సీనియర్ నేతల మధ్య అనుచితమైన సంబంధాలు ఉన్నట్లు ప్రతిపక్ష వర్కర్స్ పార్టీ (WP) సోమవారం ఆన్‌లైన్‌లో ఒక వీడియోను విడుదల చేసింది. మంత్రి చెంగ్, 2015 నుంచి పార్లమెంటులో సభ్యురాలిగా ఉన్నారు. అయితే దీనిపై ఆమె ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. పైగా ఆమె తన ఫేస్‭బుక్ పేజీని డీయాక్టివేట్ చేశారు.

Singapore Politics: సింగపూర్ పార్లమెంట్ స్పీకర్, మంత్రి రాజీనామా.. ఇద్దరి మధ్య అనుచిత సంబంధమే కారణం

Lawamakers Quit: సింగపూర్ పాలక పార్టీకి చెందిన ఇద్దరు సీనియర్ చట్టసభ సభ్యులు రాజీనామా చేశారు. ఈ ఇద్దరి రాజీనామాను ఆ దేశ ప్రధానమంత్రి లీ సేన్ లూంగ్ సోమవారం ఆమోదించారు. వీరిద్దరిలో ఒకరు ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ కాగా, మరొకరు మంత్రి. అయితే వీరి మధ్య కొనసాగుతున్న “అనుచిత సంబంధం” కారణంగా రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. రాజకీయ స్థిరత్వానికి పేరుగాంచిన సింగపూరులో దీన్ని ఉన్నత స్థాయి కుంభకోణమని ప్రధాన మంత్రి లీ సేన్ లూంగ్ అన్నారు.

Seema and Sachin: పాక్ నుంచి అక్రమంగా దేశంలోకి వచ్చిన సీమా హైదర్, ఆమె భాయ్‭ఫ్రెండ్ 2 రోజులుగా మిస్సింగ్

తన పీపుల్స్ యాక్షన్ పార్టీ (PAP) ప్రమాణాలను నిలబెట్టడానికి హౌస్ స్పీకర్ టాన్ చువాన్-జిన్, మంత్రి చెంగ్ లి హుయ్ రాజీనామాలు అవసరమని లీ అన్నారు. 1965లో దేశానికి స్వాతంత్ర్యం రాకముందు నుంచే అంటే.. 1959 నుంచి సింగపూర్‌లో అధికారంలో ఉన్న పీఏపీ పార్టీలో సీనియర్ సభ్యులు రాజీనామాలు చేయడం చాలా అరుదు. అయితే టాన్ వ్యక్తిగత ప్రవర్తన కింది స్థాయికి పడిపోయిందని లీ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే తన కుటుంబాన్ని చక్కదిద్దుకోవడానికి రాజకీయాల నుంచి వైదొలగాలని స్పీకర్ చేసిన కోరికను ప్రధాని అంగీకరించారు.

ATM Center : వీళ్లేం దొంగల్రా బాబూ.. ఏటీఎంలోంచి డబ్బులు కాకుండా ఏం ఎత్తుకెళ్లారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

ఇక మంత్రి చెంగ్, 2015 నుంచి పార్లమెంటులో సభ్యురాలిగా ఉన్నారు. అయితే దీనిపై ఆమె ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. పైగా ఆమె తన ఫేస్‭బుక్ పేజీని డీయాక్టివేట్ చేశారు. జూన్‌లో ఈ ఇద్దరు క్యాబినెట్ మంత్రులు ప్రభుత్వం తమకు కేటాయించిన బంగ్లాలను దుర్వినియోగం చేశారని వచ్చిన ఆరోపణలు నిరూపితమయ్యాయి. ఈ ఇద్దరు సీనియర్ నేతల మధ్య అనుచితమైన సంబంధాలు ఉన్నట్లు ప్రతిపక్ష వర్కర్స్ పార్టీ (WP) సోమవారం ఆన్‌లైన్‌లో ఒక వీడియోను విడుదల చేసింది.

Vangalapudi Anitha: చెప్పులు చూపిస్తూ.. టీడీపీ మహిళా నేతల ర్యాలీ.. చివరకు అతడి ఇంటికి వెళ్లి..

రాజకీయ నాయకులు ఉన్నత నైతిక ప్రమాణాలకు కట్టుబడి ఉంటారని, అవినీతి రహితంగా ఉంటారని గర్వించే సింగపూర్‌లో ఇలాంటి సంఘటనలు అసాధారణమైనవి. నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్‌లోని రాజకీయ శాస్త్రవేత్త చోంగ్ జా ఇయాన్ మాట్లాడుతూ, ఈ పరిణామాలు సింగపూర్ రాజకీయ స్థిరత్వాన్ని ప్రభావితం చేయవని అన్నారు. పాలక, ప్రతిపక్ష పార్టీల వ్యవస్థలో ఎక్కువ పారదర్శకత అవసరమని ఇది తెలియజేస్తోందని అని చోంగ్ అన్నారు.

United Progressive Alliance: యూపీఏ పేరు మారబోతోందా? బెంగళూరు విపక్షాల మీటింగు నేపథ్యంలో ఆసక్తికర విషయం

స్థానిక మీడియాతో ప్రధాని లీ సోమవారం మాట్లాడుతూ.. తక్షణ సార్వత్రిక ఎన్నికలకు పిలుపునిచ్చే ఆలోచన లేదని, ఆగస్ట్ 1 నాటికి కొత్త హౌస్ స్పీకర్‌ను నామినేట్ చేస్తానని చెప్పారు. వాస్తవానికి సింగపూర్ పార్లమెంట్ సభ 2025 నాటికి ముగుస్తుందని, ఆ తర్వాత సాధారణ ఎన్నికలు జరగాల్సి ఉందని ఆయన అన్నారు.