Wrestlers: ఆసియన్స్ గేమ్స్‌కు భజరంగ్, వినేశ్ ఫొగట్‌.. పిటిషన్లు కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు

భజరంగ్ పునియా, వినేశ్ ఫొగట్ లను ఆసియన్స్ గేమ్స్ కు పంపాలని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Wrestlers: ఆసియన్స్ గేమ్స్‌కు భజరంగ్, వినేశ్ ఫొగట్‌.. పిటిషన్లు కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు

Wrestlers

Wrestlers – Antim Panghal: రెజ్లర్లు భజరంగ్ పునియా( Bajrang Punia), వినేశ్ ఫొగట్ (Vinesh Phogat) ట్రయల్స్‌లో పాల్గొనకపోయినప్పటికీ ఆసియన్ గేమ్స్ (Asian Games 2023) లో పాల్గొనే అవకాశం దక్కించుకోవడానికి వ్యతిరేకంగా వచ్చిన పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) కొట్టేసింది.

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ (Brij Bhushan Sharan Singh) లైంగిక వేధింపులపై భజరంగ్ పునియా, వినేశ్ ఫొగట్ పోరాటం చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆ రెజ్లర్లు ట్రయల్స్ కు దూరమయ్యారు. అయినప్పటికీ, ట్రయల్స్ నుంచి వారిద్దరికీ మినహాయింపు ఇస్తూ ఆసియన్ గేమ్స్ లో పాల్గొనే అవకాశాన్ని కల్పించింది రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అడ్ హక్ కమిటీ.

అయితే, దీనిపై అండర్‌-20 ప్రపంచ ఛాంపియన్‌ అంతిమ్‌ పంఘాల్‌ తో పాటు రెజ్లర్ సుజీత్ కల్కల్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ట్రయల్స్ ను పారదర్శకంగా నిర్వహించాలని అన్నారు. కష్టపడి సాధన చేసి, విజయాలు సాధిస్తున్న తమకు అన్యాయం చేయొద్దని చెప్పారు. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్లు వేశారు.

ఢిల్లీ హైకోర్టు న్యాయవాది జస్టిస్ సుబ్రమణ్యం ప్రసాద్ బెంచ్ శనివారం ఆ పిటిషన్లను కొట్టేసింది. భజరంగ్ పునియా, వినేశ్ ఫొగట్ లను ఆసియన్స్ గేమ్స్ కు పంపాలని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆసియన్ గేమ్స్ ఈ ఏడాది సెప్టెంబరు 19 నుంచి అక్టోబరు 8 వరకు చైనాలో జరుగుతాయి. సాక్షి మాలిక్ ను కూడా ఆ గేమ్స్ కు పంపుతామని సంబంధిత అధికారులు చెప్పారు. అయితే, ట్రయల్స్ లో పాల్గొనకుండా వెళ్లేందుకు తాను ఒప్పుకోలేదని సాక్షి మాలిక్ తెలిపింది.

Annu Rani-Kishore Jena: జావెలిన్ త్రోలో భారత్ అదరహో.. అన్ను రాణి, కిశోర్ జెనాకు బంగారు పతకాలు