Jitta Balakrishna Reddy: నన్ను ఎందుకు సస్పెండ్ చేశారో చెప్పాలి.. బీజేపీ జాతీయ నాయకత్వానికి జిట్టా పది ప్రశ్నలు..

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో 14 మందిని జైల్లో పెట్టడానికి దొరికిన సాక్షాలు, ఆధారాలు కేసీఆర్ కూతురు కవితను జైల్లో పెట్టడానికి దొరకడం లేదా అని జిట్టా బాలకృష్ణ రెడ్డి ప్రశ్నించారు.

Jitta Balakrishna Reddy: నన్ను ఎందుకు సస్పెండ్ చేశారో చెప్పాలి.. బీజేపీ జాతీయ నాయకత్వానికి జిట్టా పది ప్రశ్నలు..

Jitta Balakrishna Reddy

Telangana BJP : బీజేపీ (BJP) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఉన్న జిట్టా బాలకృష్ణ రెడ్డి (Jitta Balakrishna Reddy,) ని ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న కారణంతో ఆయనపై సస్పెండ్ వేటు వేసింది. పార్టీ నిర్ణయం పట్ల జిట్టా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అకారణంగా తెలంగాణ ఉద్యమ కారుడినైన తనను బీజేపీ నుండి సస్పెండ్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ఎందుకు సస్పెండ్ చేశారో తెలపాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేతలు సమాధానం చెప్పకపోవటంతో గన్‌పార్క్ వద్ద జిట్టా ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడారు. ఈ క్రమంలో బీజేపీ జాతీయ నాయకత్వానికి పది ప్రశ్నలను జిట్టా బాలకృష్ణ రెడ్డి సంధించాడు.

Kothagudem MLA: కొత్తగూడెం ఎమ్మెల్యే ఎవరనేది ఎప్పట్లోగా తేలనుంది.. గులాబీబాస్ వైఖరి ఏంటో?

బీఎఆర్‌ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందని, కేసీఆర్ అవినీతి పరుడని పదేపదే ప్రధాని నరేంద్రమోడీతో సహా జాతీయ నేతలు చెపుతున్నారు.. మరి చర్యలు ఎందుకు తీసుకోలేదని జిట్టా బీజేపీ నాయకత్వాన్ని ప్రశ్నించారు. కేసీఆర్, ఆయన కుటుంబం, బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి చేశారని పదేపదే మాట్లాడిన నేతలు.. దర్యాప్తు సంస్థలు ఎందుకు వాటిని రుజువు చేయడం లేదని, ఆధారాలు లేకనా? రుజువు చేయడం ఇష్టం లేదా? అంటూ బీజేపీ కేంద్ర నాయకత్వాన్ని జిట్టా ప్రశ్నించారు. ఒక రాజకీయ పార్టీగా తెలంగాణ బీజేపీ ఇప్పటివరకు కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ పై మీరు చెబుతున్న అంశాల పైన కోర్టును గాని, దర్యాప్తు సంస్థలను గానీ ఎందుకు ఆశ్రయించడం లేదని జిట్టా ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో 14 మందిని జైల్లో పెట్టడానికి దొరికిన సాక్షాలు, ఆధారాలు కేసీఆర్ కూతురు కవితను జైల్లో పెట్టడానికి దొరకడం లేదా అని ప్రశ్నించారు.

Bandi Sanjay: బీజేపీ జాతీయ నాయకత్వంలోకి బండి సంజయ్.. కీలక పదవి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ

బీఎల్ సంతోష్‌ను ఎమ్మెల్యేల కొనుగోల కేసులో లాగడంతో భయపడి బీజేపీ అగ్రనాయకత్వం.. కవిత కేసును ఆపేసి మూనుగోడు ఎన్నికల్లో అర్ధాంతరంగా మధ్యలో వదిలేసిన మాట వాస్తవం కాదా? అంటూ జిట్టా బాలకృష్ణ రెడ్డి ప్రశ్నించారు. ప్రజా సంగ్రామ యాత్ర‌తో పల్లె పల్లెకు బీజేపీని తీసుకెళ్లిన బండి సంజయ్‌ని అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించిన వైనం ఇప్పటికీ ప్రజల్లో అనుమానాలను రేకెత్తించే విధంగా ఉందని అన్నారు. తెలంగాణలో బీజేపీ బలపడాలంటే రాష్ట్ర, జిల్లా కమిటీలో మార్పులు జరగాలని బండి సంజయ్ పదేపదే జాతీయ నాయకత్వాన్ని అడిగినా ఎందుకు అనుమతి ఇవ్వలేదో కేంద్ర పార్టీ నాయకత్వం చెప్పాలని జిట్టా డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షులు మారితే పార్టీ బలపడేది కదా ఇది మీకు ఇష్టం లేదా అని నిలదీశారు. అదేవిధంగా యువతలో మంచి క్రేజీ ఉన్న ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్ అంశం ఎంత కాలం పెండింగ్లో పెడతారు..? కేసీఆర్‌కు వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేసిన వారిని సస్పెండ్ చేసి, పదవుల నుండి తొలగించి కేసీఆర్ కోవర్టులకు, పార్టీని నాశనంచేసే వారికి పెద్దపీట వేయడం ద్వారా ఏం సంకేతాలు ఇస్తున్నారని బీజేపీ కేంద్ర నాయకత్వాన్ని జిట్టా ప్రశ్నించారు.

TTD Chairman: టీటీడీ చైర్మన్ పదవి రేసులో నలుగురు.. మాజీ మంత్రివైపు అధిష్టానం మొగ్గు!

ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంద్వారా తప్పితే సొంతగా అధికారంలోకి వచ్చే ఉద్దేశం ఎందుకు లేదు..? మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, మణిపూర్, ఉత్తరఖండ్, బీహార్, అరుణాచల్ ప్రదేశ్, గోవా లాంటి రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అధికారంలోకి వచ్చిన మాట వాస్తవం కాదా..? బీజేపీ కేంద్ర నాయకత్వం చెప్పాలని జిట్టా డిమాండ్ చేశారు. పార్టీని విలీనం చేసిన సందర్భంలో భద్రాచలం అభివృద్ధి గురించి మాట ఇచ్చారు.. కేంద్ర ప్రభుత్వం పరిధిలోఉన్న భద్రాచలం అభివృద్ధిని ఎందుకు మరిచిపోయారు? ఇక్కడ గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలన్న ఆలోచన మీకు ఎందుకు రావడం లేదు? అంటూ బీజేపీ అగ్ర నేతలను జిట్టా బాలకృష్ణ రెడ్డి ప్రశ్నించారు.