Bandi Sanjay: బీజేపీ జాతీయ నాయకత్వంలోకి బండి సంజయ్.. కీలక పదవి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ

బీజేపీ జాతీయ కార్యవర్గాన్ని ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి పలువురికి చోటు దక్కింది. తెలంగాణ నుంచి బండి సంజయ్ ను కొత్తగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది.

Bandi Sanjay: బీజేపీ జాతీయ నాయకత్వంలోకి బండి సంజయ్.. కీలక పదవి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ

bandi sanjay

MP Bandi Sanjay: తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ (MP Bandi Sanjay) కు బీజేపీ (BJP) కేంద్ర అధిష్టానం కీలక పదవి అప్పగించింది.  బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, ఆఫీస్ బేరర్ల పేర్లను శనివారం ఉదయం ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా (jp nadda) ప్రకటించారు. ఈ క్రమంలో బండి సంజయ్‌కు జాతీయ నాయకత్వంలో చోటు దక్కింది. బండి సంజయ్‌తో పాటు మరికొందరికి జాతీయ ప్రధాన కార్యదర్శులుగా అవకాశం కల్పిస్తూ పార్టీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో వివిధ రాష్ట్రాలకు చెందిన మొత్తం 38 మంది నేతలతో (పాత, కొత్తవారితో) కూడిన జాబితాను జేపీ నడ్డా బీజేపీ అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా ప్రకటించారు.

Bandi Sanjay: అమిత్ షాను కలిశాక బండి సంజయ్ అంబరాన్నంటే ఆనందం.. ఎందుకో?

తెలంగాణ రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం పావులు కదుపుతోంది. ఈ క్రమంలో ఇటీవల రాష్ట్ర బీజేపీలో చోటుచేసుకున్న పార్టీ నేతల మధ్య అంతర్గత విబేధాలకు స్వస్తి చెప్పేందుకు కేంద్ర పార్టీ అధిష్టానం దృష్టిసారించింది. ఇందులోభాగంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న బండి సంజయ్‌ను పక్కకు తప్పించిన విషయం తెలిసిందే. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలను కేంద్ర పార్టీ అధిష్టానం అప్పగించింది. ఇటీవలే కిషన్ రెడ్డి పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు.

మరోవైపు ఈటల రాజేందర్, రాజగోపాల్ రెడ్డిలతో పాటు పలువురికి రాష్ట్ర పార్టీలో కీలక పదవులు అప్పగించింది. అయితే, బండి సంజయ్ ను అధ్యక్ష స్థానం నుంచి తప్పించిన తరువాత అతన్ని కేంద్ర కేబినెట్ లోకి తీసుకుంటారని ప్రచారం జరిగింది. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి స్థానంలో కేంద్ర మంత్రిగా బండి సంజయ్‌కు అవకాశం లభిస్తుందని, ఈ మేరకు జేపీ నడ్డా, అమిత్ షా హామీ ఇచ్చారని ప్రచారం జరిగింది. తాజాగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా సంజయ్‌ను నియమిస్తూ జేపీ నడ్డా ఉత్తర్వులు జారీ చేశారు.

Bandi Sanjay: సొంత పార్టీ నేతలపై బండి సంజయ్ సంచలన కామెంట్స్.. అందుకేనా?

తాజాగా బీజేపీ జాతీయ కార్యవర్గాన్ని ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి పలువురికి చోటు దక్కింది. తెలంగాణ నుంచి బండి సంజయ్‌ను కొత్తగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణ కొనసాగనున్నారు. ఏపీ నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శులుగా సత్య కుమార్, తరుణ్ చుగ్, సునీల్ బన్సల్‌ను కొనసాగించనున్నట్లు కేంద్ర పార్టీ అధిష్టానం వెల్లడించింది. అదేవిధంగా పార్టీ వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా బీఎల్ సంతోష్, సంస్థాగత వ్యవహారాల ఉప ప్రధాన కార్యదర్శిగా శివప్రకాశ్‌ను కొనసాగించనున్నట్లు బీజేపీ అధిష్టానం తెలిపింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉత్తర్వులు జారీ చేశారు.