Kashmir Soldier: సెలవుపై ఇంటికొచ్చిన సైనికుడు అదృశ్యం.. వాహనంపై రక్తపు మరకలు.. ఉగ్ర‌చర్యగా అనుమానం..

దయచేసి నా కొడుకు జావేద్‌ను విడుదల చేయండి అంటూ అతని తల్లి వీడియోలో కన్నీరు పెట్టుకుంటూ వేడుకుంది.

Kashmir Soldier: సెలవుపై ఇంటికొచ్చిన సైనికుడు అదృశ్యం.. వాహనంపై రక్తపు మరకలు.. ఉగ్ర‌చర్యగా అనుమానం..

Kashmiri soldier

Kashmir : దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో భారత సైనికుడు అదృశ్యమయ్యాడు. సెలవుపై ఇంటికి వచ్చిన సైనికుడు అదృశ్యం కావడం పట్ల కశ్మీర్ లో సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో సైన్యం అప్రమత్తమైంది. తప్పిపోయిన సైనికుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. 25ఏళ్ల రైఫిల్ మ్యాన్ జావెద్ అహ్మద్ వని సైన్యంలో పనిచేస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం సెలవుపై కుల్గాం జిల్లాలోని అస్థాల్ గ్రామంలోని తన ఇంటికి వెళ్లాడు. శనివారం సాయంత్రం 6.30 గంటల సమయంలో అతడు కారులో చావల్గాం మార్కెట్‌కు వెళ్లాడు. రాత్రి 9గంటల వరకు అతడు ఇంటికి తిరిగిరాకపోవటంతో కుటుంబీకులు ఆందోళనతో స్థానికంగా ఆరా తీశారు. అతని కారును మార్కెట్ సమీపంలో గుర్తించారు. దానికి రక్తపు మరకలు ఉన్నాయి. దీంతో తన కుమారుడిని కిడ్నాప్ చేసి ఉంటారని జావెద్ కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు.

Yadamma Raju : ఇంకా యాక్సిడెంట్ నుంచి కోలుకొని యాదమ్మ రాజు.. హాస్పిటల్ లో సేవలు చేస్తున్న భార్య..

మరోవైపు.. సమాచారం అందుకున్న సైన్యం వెంటనే భారీ ఎత్తున గాలింపు చర్యలు చేపట్టింది. గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవటంతో సైన్యం అన్నిరకాల కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. కాశ్మీర్ పోలీసులు కేసు నమోదు చేసి కొందరు అనుమానితులనుసైతం అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇదిలాఉంటే తప్పిపోయిన జావెద్ తల్లిదండ్రులు ఓ వీడియోను విడుదల చేశారు. మమ్మల్ని క్షమించండి.. మా కుమారుడిని విడుదల చేయండి అంటూ వారు ఆ వీడియోలో కన్నీటి పర్యాంతమయ్యారు.

Eye Infections : ఢిల్లీలో భారీగా పెరిగిన కండ్ల కలక కేసులు.. జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు

దయచేసి నా కొడుకును విడుదల చేయండి, నా జావేద్ ను విడుదల చేయండి అంటూ అతని తల్లి వీడియోలో కన్నీరు పెట్టుకుంటూ మొరపెట్టుకుంది. నేను అతన్ని ఆర్మీలో పనిచేయనివ్వను, దయచేసి అతన్ని విడుదల చేయాలని కోరింది. జావేద్ తండ్రి మహ్మద్ అయూబ్ వానీ మాట్లాడుతూ.. నా కొడుకు లడఖ్ లో పోస్ట్ చేయబడ్డాడు. అతను ఈద్ తర్వాత ఇంటికి వచ్చాడు. రేపు తిరిగి డ్యూటీలో చేరాల్సి ఉంది. అతను మార్కెట్ నుండి కొన్ని వస్తువులు కొనడానికి శనివారం సాయంత్రం వెళ్లాడు. అతడిని కొందరు వ్యక్తులు అడ్డుకొని కిడ్నాప్ చేశారు. నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను.. దయచేసి నా కొడుకును విడుదల చేయండి అని వీడియోలో వేడుకున్నాడు.