China Heavy Rain : చైనాలో భారీవర్షాలు..11మంది మృతి, 27 మంది గల్లంతు

చైనా దేశ రాజధాని బీజింగ్ నగరంలో కురిసిన భారీవర్షాల కారణంగా 11మంది మరణించగా, మరో 27 మంది అదృశ్యమయ్యారు. తుపాన్ విధ్వంసంలో చిక్కుకుపోయిన రైలు ప్రయాణికులకు సామాగ్రిని అందించడానికి సైనిక హెలికాప్టర్లను మోహరించారు....

China Heavy Rain : చైనాలో భారీవర్షాలు..11మంది మృతి, 27 మంది గల్లంతు

China Heavy Rain

China Heavy Rain : చైనా దేశ రాజధాని బీజింగ్ నగరంలో కురిసిన భారీవర్షాల కారణంగా 11మంది మరణించగా, మరో 27 మంది అదృశ్యమయ్యారు. తుపాన్ విధ్వంసంలో చిక్కుకుపోయిన రైలు ప్రయాణికులకు సామాగ్రిని అందించడానికి సైనిక హెలికాప్టర్లను మోహరించారు. తుపాన్ శుక్రవారం నుంచి చైనాపైకి దూసుకువచ్చింది. (China Heavy Rain) శనివారం నుంచి కురిసిన భారీ వర్షాలు బీజింగ్ నగరం, దాని పరిసర ప్రాంతాలను ముంచెత్తాయి.

Indian Woman Missing : క్రూయిజ్ షిప్‌లో భారతీయ మహిళ అదృశ్యం

జులై నెల మొత్తం సగటు వర్షపాతం కేవలం 40 గంటల్లో బీజింగ్‌లో కురిసింది. (Heavy Rain In China Capital) 26 మంది సైనికులు, నాలుగు హెలికాప్టర్‌లతో కూడిన మిలిటరీ యూనిట్ మంగళవారం తెల్లవారుజామున బీజింగ్‌లోని మెంటౌగౌ జిల్లాలో రైలు స్టేషన్‌లో, చుట్టుపక్కల చిక్కుకుపోయిన ప్రజలకు ఆహార ప్యాకెట్లను అందజేశారు. బీజింగ్‌లోని ఫాంగ్‌షాన్, మెంటౌగౌతో సహా ప్రాంతాలు వరదనీటి కారణంగా తీవ్ర నష్టాన్ని చవిచూశాయి.

Anju-Nasrullah Wedding : అంజూ-నస్రుల్లా వివాహం వెనుక పాక్ ఐఎస్ఐ కుట్ర…మధ్యప్రదేశ్ పోలీసుల విచారణ

మూడు రైళ్లు వరదల్లో చిక్కుకున్నాయి. బీజింగ్‌లోని నైరుతి ఫాంగ్‌షాన్ పరిసరాల్లో వరద నీటిలో సగం మునిగిపోయిన బస్సులు కనిపించాయి. సోమవారం హై-స్పీడ్ రైలు రైళ్లు 30 గంటల పాటు ట్రాక్‌లపై చిక్కుకున్నాయి. ఆకస్మిక వరదల వల్ల కొండచరియలు విరిగిపడే ప్రమాదం పొంచి ఉండటంతో వాతావరణశాఖ అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు.