NASA : అంతరిక్షంలో వ్యోమగాములు చనిపోతే మృతదేహాన్ని ఎలా భద్రపరుస్తారు..?భూమికి ఎలా తీసుకొస్తారు..?నాసా చెబుతున్న ఆసక్తికర విషయాలు

అంతరిక్షంలో ప్రయాణించే మనిషి చనిపోతే.. గ్రహాలమీదకు ప్రయాణాలు చేసే మనిషి అక్కడ చనిపోతే..ఆ మృతదేహాన్ని ఏం చేస్తారు? భూమ్మీదకు తీసుకొస్తారా? తీసుకురాకపోతే ఏమవుతుంది..? ఇటువంటి ప్రశ్నలకు నాసా చెప్పే సమాధానాలు ఎలా ఉన్నాయి..?

NASA : అంతరిక్షంలో వ్యోమగాములు చనిపోతే మృతదేహాన్ని ఎలా భద్రపరుస్తారు..?భూమికి ఎలా తీసుకొస్తారు..?నాసా చెబుతున్న ఆసక్తికర విషయాలు

astronauts perished On planet

astronauts  perished On planet :  అంతరిక్షం..ఎన్నో వింతలు,విశేషాలు, రహస్యాలను ఇమిడ్చుకుని మనిషికి ఎప్పుడు సవాల్ విసురుతునే ఉంటుంది.తన మేథస్సుతో పలు రహస్యాలను చేధించిన మనిసి అంతరిక్షంపై ఎప్పుడు మనస్సు పారేసుకుంటునే ఉంటాడు.అక్కడి వింతలను…రహస్యాలను ఛేదించాలనే అనుకుంటాడు.దానికి కోసం అద్భుతమైన ఉపగ్రహాలను తయారు చేసిన అనంత విశ్వంలోకి పంపించాడు. అయినా ఇంకా ఏదో ఏదో చేయాలనే మనిషి తపన..భూమ్మీదే కాదు ఈ విశ్వంలో ఉన్న గ్రహాలపై కూడా పట్టుసాధిచాలని ఉబలాటపడుతున్నాడు. ఇతర గ్రహాలపై జీవం ఆనవాళ్లు ఉన్నాయా…? మనిషి జీవించటానికి అవకాశాలు..దానికి తగిన వాతావరణం ఉందా? అని పరిశోధనలు చేస్తున్నాడు.

ఎన్నో వింతలు, రహస్యాలను తనలో దాచుకున్న అంతరిక్షంలోకి మనిషి ప్రయాణించటమంటే మాటలు కాదు. అది ఎంతో పెద్ద సాహజమే. అయినా సాహసం చేస్తేనే రహస్యాలను ఛేదించగలమనే మనిషి అంతరిక్షంలోకి అడుగు పెట్టటమే కాదు ఇప్పటికే ఎన్నో ఘనతలు సాధించాడు. అలా అంతరిక్షంలోకి వెళ్లటానికి కఠినమైన ట్రైనింగ్ అవసరం. అంతరిక్షంలోకి వెళ్లేవారిని వ్యోమోగాములు అంటారనే విషయం తెలిసిందే. ఈ విశ్వంలో ఎన్నో రహస్యాలు, ఇతర గ్రహాలపై జీవుల మనుగడ వంటి విషయాలను తెలుసుకోవటానికి మనిషి ప్రారంభించిన అన్వేషణ 60 ఏళ్ల క్రితమే మొదలైంది. అలా సాహసంతో కొన్ని విజయాలు దక్కినా వ్యోమోగాములు (astronauts)ప్రాణాలు కోల్పోవటం విషాకరమైన విషయం.

అలా అంతరిక్ష ప్రయాణా(space travel)ల్లో ఇప్పటివరకు 20 మంది వ్యోమగాములు ప్రాణాలు కోల్పోయారు. 60 సంవత్సరాల క్రితం ప్రారంభమైనప్పటి నుండి, 1986 మరియు 2003 నాటి NASA స్పేస్ షటిల్ (space shuttle)విషాదాలలో 20 మంది 14 మంది మరణించారు, 1971 సోయుజ్ 11 మిషన్‌( Soyuz 11 mission)లో ముగ్గురు వ్యోమగాములు మరియు 1967లో అపోలో 1 లాంచ్(Apollo 1 launch) ప్యాడ్ అగ్నిప్రమాదం(pad fire)లో ముగ్గురు వ్యోమగాములు మరణించారు. ప్రస్తుతం అంతరిక్ష యాత్రలు సర్వసాధారణంగా మారినా తగిన జాగ్రత్తలు తప్పని..లేదంటే ప్రాణాలపై ఆశ వదిలేసుకోవాల్సిందే. ఏ చిన్నపొరపాటు జరిగినా ఉపగ్రహంతో పాటు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. వ్యోమోగామలను అంతరిక్షంలోకి పంపే ముందువారి ఆరోగ్యం విషయంలో అత్యంత జాగ్రత్త వహిస్తారు.

కానీ ఎంత నష్టం జరిగినా..ప్రాణ నష్టం జరిగినా అంతరిక్షంపై మనిషి ఆసక్తి మాత్రం చనిపోవటంలేదు. ప్రయోగాలు చేయటం మానలేదు. దీంట్లో భాగంగానే అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా (NASA)2025 నాటికి చంద్రుడి పైకి తమ సిబ్బందిని పంపించేందుకు యోచిస్తోంది. దశాబ్ద కాలంలో అంగారకుడి(Mars)పైకి వ్యోమగాములను పంపేందుకు యత్నిస్తోంది. సాధారణంగా పెద్దలు కీడెంచి మేలు ఎంచాలని అంటుంటారు. దానికి ఏదేశమైనా అతీతం కాదు. దీంట్లో భాగంగానే అంగారకిడిపైకి వెళ్లే మార్గమధ్యలో ఎవరైనా వ్యోమోగాములు చనిపోతే..? వారిని భూమికి ఎలా తీసుకొస్తారు..? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు నాసా ప్రోటోకాల్‌ చెబుతున్న విషయాలు ఏంటో తెలుసుకుందాం..

Ukrainians freezing Sperm : రష్యాపై యుద్ధానికి ముందు స్పెర్మ్‌ భద్రపరిచిన యుక్రెయిన్ సైనికులు..భర్త దూరమైనా తల్లి కానున్న వీర సైనికుడి భార్య..

అంతరిక్షంలోకి ప్రయాణం ప్రారంభమయ్యాక భూమికి దగ్గరగా ఉన్న కక్ష్యలో ఎవరైనా వ్యోమగాములు మరణిస్తే.. సిబ్బంది మృతదేహాన్ని స్పేస్‌ కాప్య్సూల్‌ ద్వారా భూమికి తిరిగి తీసుకువచ్చే అవకాశం ఉంటుంది. దానిలో మృతదేహాన్ని భద్రపరిచేందుకు ఓ స్పెషల్ రూమ్ ఏర్పాటు చేసి ఉంటుంది. స్థిరమైన ఉష్ణోగ్రత ఉంటుంది. అయితే, అంతరిక్ష కేంద్రం (space station)లేదా అంతరిక్ష నౌక (spacecraft), భూమికి దగ్గరగా ఉన్న కక్ష్యల్లో మరణం సంభవిస్తే రోజుల వ్యవధిలో శరీరాన్ని తీసుకురాగలిగే వీలు ఉంటుంది. చంద్రుడిపై మరణం సంభవిస్తే మృతదేహాన్ని భూమి మీదకు తీసుకు వచ్చేందుకు కొన్ని రోజులు పడుతుంది.

అదే దురదృష్టవశాత్తు అంగారక గ్రహయాత్రలో ఎవరైనా వ్యోమోగామి చనిపోతే.. మృతదేహాన్ని వెనక్కి తీసుకురాలేరు. ఆ మిషన్‌ పూర్తి అయ్యే వరకు ఉండాల్సిందే. అంటు దేహాన్ని తీసుకువచ్చేందుకు కొన్ని సంవత్సరాలు పట్టే అవకాశం ఉంటుందని శాస్ర్తవేత్తలు వెల్లడించారు.

12 Lakhs Sunflowers Gift To wife : 50 పెళ్లిరోజు గిఫ్టుగా భార్యకు 12 లక్షల సన్‌ఫ్లవర్స్.. అంబరాన్ని అంటిన ఆమె ఆనందం

వ్యోమోగాములకు వారి డ్రెస్సే ప్రాణాలను నిలుపుతుంది. దీనికోసం ప్రత్యేకంగా డ్రెస్ తయారు చేస్తారనే విషయం తెలిసిందే.దాన్నే స్పేస్ సూట్ అంటారు. ఆ స్పేస్‌సూట్‌ లేకుండా అంతరిక్షంలో అడుగు పెడితే ప్రాణాలు కోల్పోవాల్సిందే. ఎందుకంటే మనిషి జీవించటానికి ఆక్సిజన్ నే ప్రధాన కారణం. ఆ ఆక్సిజన్‌ లేకపోవడంతో మనిషి పీడనం కోల్పోతాడు. రక్తంలో వేడి పెరిగిపోతుంది. కేవలం కొన్ని నిమిషాల్లోనే మరణిస్తాడు.

గ్రహంమీద ల్యాండ్‌ అయ్యాక మరణిస్తే..
భూమిపై శరీరాన్ని ఖననం చేస్తే.. కీటకాలు మృతదేహాన్ని కుళ్లింపజేస్తాయి. అంటే డీకంపోజ్ చేస్తాయి. అలా జరిగితేనే పర్యావరణానికి మంచిది కూడా. కానీ.. అంగారకుడి ఉపరితలంపై ల్యాండ్‌ అయ్యాక మరణిస్తే.. అప్పుడు ఏం జరుగుతుంది.. అనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే భూమ్మీద ఉండే పరిస్థితులు అక్కడ ఉండవు. దీంతో మృతదేహం ఏమవుతుంది..? అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది. అంగారకుడిపై మనిషి చనిపోతే శరీరంలోని బాక్టీరియా వల్ల ఆ గ్రహ ఉపరితలం కలుషితమౌతుంది. అలాంటి సమయంలో మృతదేహాన్ని భూమికి తీసుకొచ్చేంత వరకు ప్రత్యేకమైన బాడీ బ్యాగ్‌లో భద్రపరచాల్సి ఉంటుంది. దీనికి వేరే దారిలేదు. అలాగే ఆ బాడీ పాడైపోకుండా ఉంటానికి ఆ రూమ్ టెంపరేచర్ ఉండాలి.

అంతరిక్షంలో వ్యోమోగామి చనిపోతే శరీరాన్ని ఏమి చేయాలనేది కేవలం ప్రశ్న మాత్రమే కాదు..నష్టాన్ని ఎదుర్కోవడంలో సిబ్బందికి సహాయం చేయడం,భూమిపై ఉన్న వారి కుటుంబాలకు సహాయం చేయడం. బాధ్యత వహించటం. మరణించిన వ్యక్తి యొక్క అవశేషాల గురించి జాగ్రత్తలు తీసుకోవాటం అత్యంత అవసరం.