Kokapet Neopolis : ఎకరం 100 కోట్లపైనే.. ఇంతకీ కోకాపేట నియోపోలిస్ ప్లాట్ల ప్రత్యేకత ఏంటి? వాటికి ఎందుకంత భారీ డిమాండ్? ప్లాట్ నెంబర్ 10లో ఏముంది?

కోకాపేట భూముల వేలంలో ఇది ఆల్ టైమ్ రికార్డ్. ఇంతకీ నియోపోలిస్ ప్లాట్లకు ఎందుకంత డిమాండ్? Kokapet Neopolis Layout

Kokapet Neopolis : ఎకరం 100 కోట్లపైనే.. ఇంతకీ కోకాపేట నియోపోలిస్ ప్లాట్ల ప్రత్యేకత ఏంటి? వాటికి ఎందుకంత భారీ డిమాండ్? ప్లాట్ నెంబర్ 10లో ఏముంది?

Kokapet Neopolis Layout(Photo : Google)

Kokapet Neopolis Layout : 10 కోట్లు కాదు 50 కోట్లు కాదు.. 100 కోట్లపైనే.. ఎకరం భూమి ధర అక్షరాల 100 కోట్ల పైమాటే.. హైదరాబాద్ నగరంలోని కోకాపేట భూముల వేలం సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. కోకాపేట నియోపోలిస్ ఫేజ్-2 వేలంలో భూములకు భారీ డిమాండ్ ఏర్పడింది. హైదరాబాద్ చరిత్రలోనే అత్యధికంగా ఎకరం ధర రూ. 100 కోట్లు దాటడం విశేషం. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) నియోపోలిస్ భూములకు వేలం నిర్వహించింది. నియోపోలిస్ ప్లాట్లలో.. ముఖ్యంగా ప్లాట్ నెంబర్ 10 కోసం రియాల్టీ సంస్థల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది.

కోకాపేటలో నియోపోలిస్ ఫేజ్-2 భూములకు హెచ్ఎండీఏ వేలం నిర్వహించింది. ఈ ఆక్షన్ లో భూముల ధర ఆల్ టైమ్ రికార్డ్ పలికింది. ఎకరం రేటు వంద కోట్లు దాటేసింది. ఇంకా వేలం కొనసాగుతోంది. 45.3 ఎకరాలకు సంబంధించిన వేలం పాట జరుగుతోంది. ఇందులో అత్యధికంగా ఎకరం ధర 100 కోట్లకు చేరుకుంది. రెండు రియాల్టీ సంస్థలు ప్లాట్ నెంబర్ 10లో 3.60 ఎకరాల కోసం పోటీ పడుతున్నాయి. ఇందులో ఎకరం ధర 100 కోట్లు క్రాస్ చేసింది. ఏపీఆర్, రాజపుష్ప రియాల్టీ సంస్థలు ప్లాట్ నెంబర్ 10 కోసం పోటీపడుతున్నాయి. కోకాపేట భూముల వేలంలో ఇది ఆల్ టైమ్ రికార్డ్. ఇంతకీ ప్లాట్ నెంబర్ 10లో ఏముంది? నియోపోలిస్ ప్లాట్లకు ఎందుకంత డిమాండ్?

Also Read..Laptop Imports: ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌ల దిగుమతిపై నిషేధం.. కారణం ఏంటో తెలుసా?

నియోపోలిస్ ప్లాట్లకు ఎందుకంత డిమాండ్ అంటే..
కోకాపేట నియోపోలిస్ లో ప్లాట్లకు భారీగా డిమాండ్ ఉంది. 2021లోనూ వేలంలో ఇక్కడ ఎకరం ధర రూ.60కోట్లకు పైనే పలికింది. నియోపోలిస్ సెంటర్ పాయింట్ లో ఉంటుంది. బాగా ఎత్తులో ఉంటుంది. దాంతోపాటు నియోపోలిస్ ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉంటుంది. ఇక్కడ హెచ్ఎండీఏ ప్రణాళికబద్దంగా మౌలిక వసతులను అభివృద్ధి చేసింది. వెడల్పైన రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ వ్యవస్థ.. ఇలా అన్ని రకాల మౌలిక వసతులను ఇక్కడ హెచ్ఎండీఏ డెవలప్ చేసింది. దాంతో పాటు ఐటీ హబ్ కు పక్కనే నియోపోలిస్ ఉంటుంది. ఈ కారణాలతో నియోపోలిస్ లో ఉన్న ప్లాట్లకు భారీ స్థాయిలో డిమాండ్ ఉంటుంది. ఈరోజు వేసిన వేలంలో ప్లాట్ నెంబర్ 10 ప్రైమ్ లొకేషన్ లో ఉంది. నియోపోలిస్ కు దారితీసే రోడ్లు అన్నీ కూడా ఈ ప్లాట్ నెంబర్ 10 దగ్గరి నుంచే స్టార్ట్ అవుతాయి. ప్లాట్ నెంబర్ 10 పక్కన పెద్ద పెద్ద రియాల్టీ కంపెనీలు నిర్మాణాలు ప్రారంభించాయి. హైరైజ్ అపార్ట్ మెంట్లు నిర్మిస్తున్నాయి.

నివాసంతో పాటు వాణిజ్యపరమైన అపార్ట్ మెంట్ల నిర్మాణం జరుగుతోంది. అందుకే ప్లాట్ నెంబర్ 10కి అంత డిమాండ్ ఉంది. ప్లాట్ నెంబర్ 10లో మొత్తం 3.60 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి కోసం రెండు రియాల్టీ సంస్థలు పోటీ పడుతున్నాయి. దాంతో ఎకరం ధర రూ.100 కోట్లు దాటింది. మొత్తంగా నియోపోలిస్ భూముల వేలంలో ఎకరం ధర వంద కోట్లు దాటడం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు ఇదే అత్యధిక భూమి ధర. నియోపోలిస్ లో గతేడాది ఎకరా భూమి 60 కోట్లు పలికితే ఈసారి వంద కోట్లు క్రాస్ చేసింది.