Nandi Awards : నంది అవార్డ్స్ ఇస్తే ఊరుకునేది లేదు.. హెచ్చరిస్తూ ఫిల్మ్ ఛాంబర్ ప్రెస్ నోట్ రిలీజ్..

తెలంగాణ ప్రభుత్వం త్వరలో నంది అవార్డ్స్ పై చర్చ జరుపుతాము అని చెబుతూ వస్తుంటే, ఏపీ ప్రభుత్వం మాత్రం ఇప్పట్లో నంది అవార్డులు ఇవ్వలేము అని చెప్పేస్తున్నారు. ఇది ఇలా ఉంటే..

Nandi Awards : నంది అవార్డ్స్ ఇస్తే ఊరుకునేది లేదు.. హెచ్చరిస్తూ ఫిల్మ్ ఛాంబర్ ప్రెస్ నోట్ రిలీజ్..

Telugu Film Chamber of Commerce condemn TFCC Nandi awards

Nandi Awards : టాలీవుడ్ లో నంది అవార్డ్స్ విషయం ఇప్పటిలో ఒక కొలిక్కి వచ్చేలా లేదు. సినీ పరిశ్రమలోని 24 క్రాఫ్ట్స్ కి చెందిన వర్కర్స్ ఎంతో గౌరవంగా భావించే పురస్కారం ‘నంది అవార్డు’. అలాంటిది ఈ అవార్డుని రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు 2017 నుంచి ఇవ్వడం ఆపేశాయి. అప్పటి నుంచి సినీ పరిశ్రమలోని ప్రముఖులు దాని గురించి రెండు ప్రభుత్వాలని ప్రశ్నిస్తూ వస్తున్నా లాభం లేకుండా పోయింది. తెలంగాణ ప్రభుత్వం త్వరలో ఆ అవార్డ్స్ పై చర్చ జరుపుతాము అని చెబుతూ వస్తుంటే, ఏపీ ప్రభుత్వం మాత్రం ఇప్పట్లో నంది అవార్డులు ఇవ్వలేము అని చెప్పేస్తున్నారు.

Naga Chaitanya : తండ్రికి తగ్గ తనయుడు.. అమ్మాయిల మధ్యలో యువ మన్మధుడు..

ఇక ఈ విషయం ఏ కొలిక్కి రాకపోవడంతో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్.. TFCC నంది అవార్డ్స్ పేరిట తన సొంత ఖర్చులతో  నంది అవార్డ్స్ ని అందజేస్తానంటూ ముందుకొచ్చారు. టాలీవుడ్ తో పాటు సౌత్ ఇండస్ట్రీలోని తమిళ్, కన్నడ, మలయాళ సినిమాలకు కూడా ఈ అవార్డ్స్ ఇవ్వనున్నారు. ఈ అవార్డుల ప్రధానోత్సవాన్ని దుబాయ్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో ఆగస్టు 12న నిర్వహించడానికి డేట్ కూడా ఫిక్స్ చేశారు. అయితే ఆ తేదీ ఇప్పుడు సెప్టెబర్ 24కి వాయిదా వేశారు. ఇక అవార్డ్స్ పురస్కారం పై తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ అభ్యంతరం వ్యక్తం చేశాయి.

Game Changer : శంకర్ సినిమా అంటే సాంగ్స్ రేంజ్ వేరు.. పాటలు కోసం ఎన్ని కోట్లు ఖర్చు చేశారో తెలుసా..?

‘నంది అవార్డ్’ పేటెంట్ పై అధికారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకి మాత్రమే ఉందని, ఆ అవార్డుని ఇతర ప్రైవేటు వ్యక్తులు లేదా ప్రైవేటు సంస్థలు ఉపదయోగించడానికి వీలులేదని పేర్కొన్నారు. ఒకవేళ ఆ పేరుతో ఎవరైనా నంది అవార్డ్స్ ఇస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరిస్తూ రెండు ఫిల్మ్ ఛాంబర్స్ ప్రెస్ నోట్ రిలీజ్ చేశాయి. కాగా ‘తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్’ అనేది మొత్తం టాలీవుడ్ కి సంబంధించింది. ‘తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్’, ‘ఏపీ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్’ అనేవి ఇరు ప్రభుత్వాల గుర్తింపు పొందిన ఛాంబర్స్. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) అనేది ప్రభుత్వం గుర్తింపు లేని ఛాంబర్.