Encounter : జమ్మూకాశ్మీర్ లో ఎన్ కౌంటర్.. ఉగ్రవాదిని హతమార్చిన భద్రతా దళాలు

ఈ క్రమంలో ఆదివారం తెల్లావారుజామున గాలింపు బృందంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపారు.

Encounter : జమ్మూకాశ్మీర్ లో ఎన్ కౌంటర్.. ఉగ్రవాదిని హతమార్చిన భద్రతా దళాలు

Rajouri encounter

Encounter Terrorist killed : జమ్మూకాశ్మీర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో ఉగ్రవాది హతమయ్యారు. రాజౌరి జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పలు జరిగాయి. ఈ ఎన్ కౌంటర్ లో ఒక ఉగ్రవాది మృతి చెందారు. రాజౌరీ జిల్లాలోని బరియామా ప్రాంతంలో భద్రతా దళాలు, పోలీసులు సంయుక్తంగా ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టారు.

ఈ క్రమంలో ఆదివారం తెల్లావారుజామున గాలింపు బృందంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎన్ కౌంటర్ లో ఒక ఉగ్రవాది హతమయ్యాడని జమ్మూ ఏడీజీపీ ముకేష్ సింగ్ పేర్కొన్నారు. ఖవాస్ ప్రాంతంలో ఎన్ కౌంటర్ కొనసాగుతోందని తెలిపారు.

PM Modi : అమృత్ భారత్ స్టేషన్ పథకం.. దేశవ్యాప్తంగా 508 రైల్వేస్టేషన్లలో అభివృద్ధిపనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారని, ఇప్పటివరకు ఒక ఉగ్రవాది చనిపోయాడని వెల్లడించారు. ఉగ్రవాది ఏ సంస్థకు చెందినవాడన్నది ఇంకా తెలియలేదని, గుర్తించాల్సి ఉందని చెప్పారు.

కాగా, శుక్రవారం దక్షిణ కశ్మీర్ లోని కుల్గాం జిల్లాలోని హలన్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదుల కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. దీంతో జమ్మూకాశ్మీర్ అంతటా హై అలర్ట్ ప్రకటించారు. ఉగ్రాదుల కోసం ఆర్మీ జవాన్లు జల్లెడ పడుతున్నారు.