Boyfriend Killed Girlfriend : పెళ్లి చేసుకోవాలని అడిగిన ప్రియురాలిని.. వేగంగా వెళ్తున్న లారీ కిందికి తోసేసి హతమార్చిన ప్రియుడు

ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో అటువైపుగా వాటర్ ట్యాంకర్ లారీ రావడాన్ని గమనించిన తిరుపతి కావాలనే ఉద్ధేశపూర్వకంగా ప్రమీలను లారీ కిందకు తోసేశాడు.

Boyfriend Killed Girlfriend : పెళ్లి చేసుకోవాలని అడిగిన ప్రియురాలిని.. వేగంగా వెళ్తున్న లారీ కిందికి తోసేసి హతమార్చిన ప్రియుడు

boyfriend killed girlfriend

Boyfriend Killed Girlfriend In Hyderabad : హైదరాబాద్ బాచుపల్లిలో దారుణం జరిగింది. ఓ యువకుడు ఘాతుకానికి పాల్పడ్డాడు. పెళ్లి చేసుకోవాలని అడిగిన ప్రియురాలిని వేగంగా వెళ్తున్న వాటర్ ట్యాంకర్ లారీ కిందికి తోసేసి హత మార్చాడు. సీఐ సుమన్ తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లాకు చెందిన ప్రమీల, తిరుపతి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ప్రమీల సేల్స్ గర్ల్ గా పనిచేస్తున్నారు. తిరుపతి కారు డ్రైవర్ గా పనిచేస్తున్నారు.

ఈ నేపథ్యంలో తనను పెళ్లి చేసుకోవాలని తిరుపతిని ప్రమీల కోరారు. ఇదే విషయంపై ఆదివారం ఇద్దరూ బాచుపల్లి వద్ద కలిసి మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో అటువైపుగా వాటర్ ట్యాంకర్ లారీ రావడాన్ని గమనించిన తిరుపతి కావాలనే ఉద్ధేశపూర్వకంగా ప్రమీలను లారీ కిందకు తోసేశాడు.

East Godavari Accident : అర్ధరాత్రి కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురు మృతి

దీంతో లారీ యువతిని ఢీకొట్టి ఆమెపై నుంచి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. యువతి బాయ్ ఫ్రెండ్ తిరుపతి, ట్యాంకర్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

అయితే, మొదట రోడ్డు ప్రమాదంగా, యువతి అనుమానాస్పద మృతిగా భావించారు. యువతిని బాయ్ ఫ్రెండ్ తోసి వేశారా? ప్రమాదవశాత్తు లారీ కిందపడి చనిపోయారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. సీసీ కెమెరా ఫుటేజ్ సేకరించి పరిశీలించారు. తిరుపతిని విచారించగా అతను కావాలనే ప్రియురాలు ప్రమీలను లారీ కిందికి తోసి వేశాడని పోలీసులు నిర్ధారించారు.