Headache : తలనొప్పి ఎందుకు వస్తుంది? దానిని నివారణకు చిట్కాలు

అధిక రక్తపోటు వంటి తలనొప్పికి కారణమయ్యే ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడం వల్ల తల నొప్పిని తగ్గించుకోవచ్చు. ప్రాథమికంగా తలనొప్పికి చికిత్స లేదు. చికిత్స లక్షణాలను బట్టి ఉపశమనం కలిగించే చర్యలు తీసుకోవటం అన్న విధానాన్ని చాలా మంది అనుసరిస్తుంటారు.

Headache : తలనొప్పి ఎందుకు వస్తుంది? దానిని నివారణకు చిట్కాలు

headache

Headache : తలనొప్పిని నివారించడంలో కీలకం వాటిని ప్రేరేపించే వాటిని గుర్తించడం. మీకు తలనొప్పిని కలిగించేది ఇతరులకు సమస్య కాకపోవచ్చు. మీకు తలనొప్పి రావటానికి కారణమయ్యే అంశాలను త్వరితగతిన గుర్తించటం ద్వారా నివారించవచ్చు. ఉదాహరణకు, బలమైన సువాసనలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. పెర్ఫ్యూమ్‌లు, సువాసన గల ఉత్పత్తులను నివారించడం వల్ల తలనొప్పి విషయంలో కొంత తేడాను గమనించవచ్చు. అలాగే సమస్యాత్మకమైన ఆహారాలు, నిద్ర లేకపోవడం, వంటి ఇతర కారణాలు సైతం తలనొప్పికి దారి తీస్తాయి.

READ ALSO : Diabetes and headaches : తలనొప్పి అనేది రక్తంలో చక్కెర ఎక్కువ లేదా తక్కువగా ఉన్నప్పుడు కనిపించే లక్షణమా?

అధిక రక్తపోటు వంటి తలనొప్పికి కారణమయ్యే ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడం వల్ల తల నొప్పిని తగ్గించుకోవచ్చు. ప్రాథమికంగా తలనొప్పికి చికిత్స లేదు. చికిత్స లక్షణాలను బట్టి ఉపశమనం కలిగించే చర్యలు తీసుకోవటం అన్న విధానాన్ని చాలా మంది అనుసరిస్తుంటారు. తలనొప్పులు రోజువారీ పనితీరుపై ప్రభావం చూపిస్తాయి. మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంటే వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స పొందటం మంచిది.

తలనొప్పి నుండి ఉపశమనం పొందేందుకు చిట్కాలు ;

డీహైడ్రేషన్‌ కారణంగా తలనొప్పి వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. కాబట్టి నీరు శరీరానికి సరిపడినంత మోతాదులో రోజువారిగా తీసుకోవటం మంచిది. ముఖ్యంగా కొబ్బరినీళ్లు, జ్యూస్‌, మజ్జిగ వంటి ద్రవ పదార్థాలు తాగితే తలనొప్పి తగ్గే అవకాశం ఉంది.

తలనొప్పిని పొగొట్టటంలో గ్రీన్‌ టీ బాగా ఉపకరిస్తుంది. గ్రీన్ టీలో కాస్త తేనె వేసుకుని తాగితే తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. పసుపు పాలు వేడి పాలలో చిటికెడు పసుపు వేసుకుని తాగితే, తలనొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు.

READ ALSO : Headache : చల్లని గాలి వల్ల తలనొప్పి వస్తోందా? దీన్ని వదిలించుకోవడానికి గృహ చిట్కాలు ఇవే!

తలనొప్పిగా ఉన్న సమయంలో ధ్యానం చేయటం, శ్వాస వ్యాయామాలు చేయటం వంటి వాటి వల్ల నొప్పి నుండి త్వరితగతిన బయటపడవచ్చు. ఒత్తిడి వల్ల వచ్చిన తలనొప్పి ని సైతం సాధారణ శ్వాస వ్యాయామాలతో తగ్గించుకోవచ్చు.

గంధంతో తలపట్టు వేసుకోవటం ద్వారా తలనొప్పి వచ్చినసందర్భంలో ఉపశనం పొందవచ్చు. గంధం చల్లదనాన్ని ఇస్తుంది. గంధం పేస్ట్‌ను తలకు రాసి విశ్రాంతి తీసుకోవటం ద్వారా త్వరగా రిలీఫ్ వస్తుంది.

READ ALSO : ఉదయం నిద్రలేస్తూనే తలనొప్పిగా ఉంటుందా?

ఐస్‌ప్యాక్‌ని నుదురుపై పెట్టుకుని కొద్దిసేపే అలాగే ఉంచుకోవటం ద్వారా తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే తులసి, పెప్పర్‌మింట్‌, యూకలిప్టస్‌ నూనెలను నుదురు, కణతులకు రాయటం ద్వారా తలనొప్పి తగ్గుతుంది. కొబ్బరి నూనెతో తలపై మర్దన చేసినా మంచి ఫలితం ఉంటుంది.

ఈ చిట్కాలకు కూడా లొంగకుండా తలనొప్పి తీవ్రత అధికంగా ఉంటే శరీరంలో ఇతరత్రా సమస్యలు ఉత్పన్నం కావటం వల్లేనని భావించి వైద్యులను సంప్రదించి తగిన పరీక్షల చేయించుకోవటం ద్వారా అసలు సమస్యను నిర్ధారించుకోవాలి. వైద్యుల సూచనల మేరకు చికిత్స పొందటం మంచిది.