Movies : కరోనా దెబ్బకు పడిపోయిన సినిమాల నిర్మాణం.. సెన్సార్ బోర్డు నివేదిక.. సంవత్సరానికి ఎన్ని సినిమాలు?

తాజాగా కేంద్ర సెన్సార్ బోర్డు గత మూడు సంవత్సరాలుగా వచ్చిన సినిమాల లిస్ట్ అంతా ప్రకటించింది. ఈ లిస్ట్ ప్రకారం కరోనా వల్ల సినిమా నిర్మాణం బాగా తగ్గిందని, దేశం మొత్తం మీద సినిమాల సంఖ్య కూడా తగ్గిందని తెలిపింది.

Movies : కరోనా దెబ్బకు పడిపోయిన సినిమాల నిర్మాణం.. సెన్సార్ బోర్డు నివేదిక.. సంవత్సరానికి ఎన్ని సినిమాలు?

Movies Production Decreased in last three years due to Covid

Censor Board Movies : కరోనా దెబ్బకి అన్ని రంగాలతో పాటు సినిమా రంగం కూడా కుదేలయింది. అసలు సినిమా రంగమే ఎక్కువగా దెబ్బ తింది కరోనా వల్ల. కరోనా రావడంతోనే ముందు సినిమా హాళ్లు మూసివేసి, సినిమా షూటింగ్స్ బంద్ చేశారు. దీంతో దేశంలోని అన్ని సినీ పరిశ్రమలకు భారీ దెబ్బ తగిలింది. సినిమా రంగం కొన్ని వేల కోట్లు నష్టపోయింది.

తాజాగా కేంద్ర సెన్సార్ బోర్డు గత మూడు సంవత్సరాలుగా వచ్చిన సినిమాల లిస్ట్ అంతా ప్రకటించింది. ఈ లిస్ట్ ప్రకారం కరోనా వల్ల సినిమా నిర్మాణం బాగా తగ్గిందని, దేశం మొత్తం మీద సినిమాల సంఖ్య కూడా తగ్గిందని తెలిపింది. సెన్సార్ బోర్డు లెక్క ప్రకారం 2018-2019లో 22,570 చిత్రాల ప్రదర్శనకు సెన్సార్ క్లియర్ చేశారు. 2019-20లో 20,593 సినిమాలకు అనుమతి ఇచ్చారు. అయితే కరోనా దెబ్బకు అది దారుణంగా పడిపోయి 2020-2021లో కేవలం 8,299 సినిమాలు మాత్రమే బయటకు వచ్చాయి. ఇక 2021-22లో కూడా కేవలం 12,719 సినిమాలకు అనుమతి ఇవ్వగా 2022-23లో మాత్రం ఈ సంఖ్య కొద్దిగా పెరిగి 18,070 సినిమాలకు సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇచ్చింది. అంటే అన్ని సినిమాలు బయటకి వచ్చాయి. సెన్సార్ బోర్డు ఇచ్చిన ఈ లెక్కలో ఫీచర్‌ ఫిల్మ్స్‌, లఘుచిత్రాలు, డాక్యుమెంటరీలు, విదేశీ చిత్రాలు.. అన్ని కలిపి ఉన్నాయి.

Suriya : హీరో సూర్య పిల్లలు ఎక్కడ చదువుతున్నారో తెలుసా?

కరోనా కారణంగా కొన్నాళ్ళు సినిమా షూటింగ్స్ ఆపేయడం, సినిమా హాళ్లు మూసేయడంతో సినిమా నిర్మాణం కూడా ఆపేశారు. డబ్బులు వస్తాయో రావో, థియేటర్స్ కి జనాలు వస్తారో రారో అని చాలా మంది సినిమా నిర్మాణం ఆపేశారు. గతంతో పోలిస్తే ఈ మూడు సంవత్సరాలు సినిమాల నిర్మాణం తగ్గింది. అదే సమయంలో ఓటీటీ ప్రభావం ఎక్కువవడంతో మంచి సినిమాలు, కొత్త కొత్త కంటెంట్స్, ఓటీటీ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. ఇక ఇటీవల మన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. రానున్న రోజుల్లో సినిమా నిర్మాణం మరింత పెరిగి సినిమాల సంఖ్య కూడా పెరగనుంది.