Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్లు ఇలా..

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పడిపోయిన నేపథ్యంలో దేశీయంగాకూడా బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో గురువారం ఉదయం వరకు నమోదైన బంగారం ధరలను పరిశీస్తే..

Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్లు ఇలా..

Gold price

Today Gold Rate: బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి శుభవార్త. గోల్డ్ ధరలు గురువారం కూడా తగ్గాయి. గత నెలరోజులుగా ధరలు తగ్గుకుంటూ వస్తున్నాయి. గతనెలలో గరిష్ట స్థాయికి గోల్డ్ రేటు చేరింది. ఆ తరువాత క్రమంగా తగ్గుకుంటూ వస్తుండటంతో నెల రోజుల వ్యవధిలోనే తులం బంగారంపై రూ. వెయ్యి వరకు ధర తగ్గడం విశేషం. ప్రస్తుతం శుభముహూర్తాలు ప్రారంభమయ్యాయి. కొద్దిరోజుల వరకు పెళ్లిళ్లకు మంచి ముహూర్తాలు ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెళ్లిళ్లు జరగనున్నాయి. దీంతో మహిళలు బంగారం దుకాణాలవైపు చూస్తున్నారు. ఈ క్రమంలో బంగారం ధరలు తగ్గుముఖం పడుతుండటంతో వారికి ఊరటనిచ్చే అంశం.

Gold

Gold Price Today

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పడిపోయిన నేపథ్యంలో దేశీయంగాకూడా బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో గురువారం ఉదయం వరకు నమోదైన బంగారం ధరలను పరిశీస్తే.. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,450గా ఉంది. బుధవారంతో పోల్చిన 10గ్రాములపై రూ. 100 తగ్గింది. అదేవిధంగా 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర 59,400కు చేరింది. బుధవారంతో పోల్చితే రూ. 110 వరకు తగ్గింది. వరంగల్, విశాఖపట్టణం, విజయవాడ ప్రాంతాల్లోనూ బంగారం ధరలు ఒకే విధంగా ఉన్నాయి.

Gold

Gold

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో 10గ్రాముల బంగారం ధరలను పరిశీలిస్తే.. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 54,600 మార్కు వద్ద ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,550కి చేరింది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,950కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,950గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 54,450 మార్కు వద్ద ఉంది. 24 క్యారెట్ల ధర రూ. 59,400గా ఉంది.

Gold

Gold

వెండి ధరలు కాస్త పెరిగాయి. హైదరాబాద్‌లో రూ. 200 పెరగడంతో కిలో వెండి ధర రూ. 76,200 మార్కును తాకింది. ఢిల్లీలో రూ. 200 పెరిగి కిలో వెండి ధర రూ. 73వేల మార్కు వద్దకు చేరింది. వెండి ధరలు పెరిగినప్పటికీ బంగారం ధరలు తగ్గుముఖం పడుతుండటంతో మహిళలకు ఊరటనిచ్చే అంశం. అయితే, వచ్చే కొద్దిరోజులపాటు శుభముహూర్తాలు ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిసందడి మొదలు కానుంది. ఈ క్రమంలో బంగారం ధరలు కాస్త పెరిగే అవకాశం ఉందని నిపుణుల అంచనా.