Vemulawada Govt Hospital : వేములవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో బిడ్డకు జన్మనిచ్చిన జడ్జి .. ఉయ్యాల బహుమతిగా ఇచ్చిన సూపరింటెండెంట్‌

వేములవాడ ఏరియా ఆస్పత్రిలో వేములవాడ జూనియర్‌ సివిల్‌ కోర్టు జడ్జి జ్యోతిర్మయి పండంటి బిడ్డకు జన్మనిచ్చారు.

Vemulawada Govt Hospital : వేములవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో బిడ్డకు జన్మనిచ్చిన జడ్జి .. ఉయ్యాల బహుమతిగా ఇచ్చిన సూపరింటెండెంట్‌

Vemulawada Govt Hospital

Vemulawada : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవం కోసం రావటమంటే ప్రాణాలమీద ఆశ వదిలేసుకోవటమే అనే రోజులకు స్వస్తి చెప్పి ప్రసవానికి సర్కారు దవాఖానాలకే వచ్చేలా తెలంగాణ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. దీంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరుగుతోంది. ఉన్నతస్థానాల్లో ఉండే మహిళలు కూడా ప్రసవం కోసం ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తున్నారు. అలా ఓ మహిళా న్యాయమూర్తి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవించారు. పండంటి బిడ్డకు జన్మనిచ్చారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరియా ఆస్పత్రిలో వేములవాడ జూనియర్‌ సివిల్‌ కోర్టు జడ్జి (Vemulawada Junior Civil Court Judge)జ్యోతిర్మయి పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. హైదరాబాద్‌కు చెందిన K.జ్యోతిర్మయి (K Jyothirmai )ఇటీవలే వేములవాడకు ట్రాన్స్ ఫర్ అయి వచ్చారు. గర్భిణిగా ఉన్న ఆమె ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం చేయించుకోవాలనుకున్నారు. ఈ క్రమంలో మంగళవారం (ఆగస్టు 15,2023)ఆమె డ్యూటీలో ఉండగా పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో ఆమె వేములవాడ ఏరియా ఆస్పత్రిలో చేరారు. డాక్టర్ చైతన్య సుధా (gynaecologist Dr Chaitanya Sudha)ఆమెకు సాధారణ ప్రసవం చేయగా..పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చారు (gave birth to a baby girl) జ్యోతిర్మయి.

Minister KTR : సూట్ కేసులో సత్యనారాయణ స్వామి వ్రత మండపం .. వీడియో షేర్ చేసిన మంత్రి కేటీఆర్

తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని డాక్టర్లు తెలిపారు. వేములవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో మొదటికాన్పులో ఆడబిడ్డ జన్మిస్తే జన్మనిచ్చిన తల్లికి ఉయ్యాలను బహుమతి ఇస్తున్నామని..దీంతో న్యాయమూర్తి జ్యోతిర్మయికి కూడా ఉయ్యాల అందజేశామని తెలిపారు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ (hospital superintendent)డాక్టర్‌ రేగులపాటి మహేశ్‌రావు (Dr Regulapati Mahesh Rao)తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రిలో అందిస్తున్న వైద్య సేవలపై న్యాయమూర్తి జ్యోతిర్మయి ఎంతో సంతృప్తి వ్యక్తంచేశారని ఈ సందర్భంగా సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రేగులపాటి మహేశ్‌రావు తెలిపారు.