కడిగిన ముత్యంలా బయటకు వస్తాను- ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు
బీఆర్ఎస్ శ్రేణులు కవితకు ఘన స్వాగతం పలికాయి. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి భారీ కాన్వాయ్ తో తన నివాసానికి చేరుకున్నారు కవిత.

Mlc Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుపై ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయ బద్ధమైన పోరాటం గెలిచిందన్నారు కవిత. ప్రజాక్షేత్రంలో ఇంకా బలంగా పనిచేస్తానని తెలిపారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు నుంచి కడిగిన ముత్యంలా బయటకు వస్తానని కవిత విశ్వాసం వ్యక్తం చేశారు. చరిత్రలో ఎప్పుడూ న్యాయం, ధర్మమే గెలుస్తాయన్న కవిత.. తన విషయంలో కూడా న్యాయం గెలిచిందన్నారు. కడిగిన ముత్యంలా బయటకు వస్తానన్న నమ్మకం తనకు ఉందన్నారు కవిత. కేసీఆర్ నాయకత్వంలో బలంగా పోరాడతానని చెప్పారామె.
హైదరాబాద్ బంజారాహిల్స్ లోని తన నివాసానికి ఎమ్మెల్సీ కవిత చేరుకున్నారు. బీఆర్ఎస్ శ్రేణులు కవితకు ఘన స్వాగతం పలికాయి. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి భారీ కాన్వాయ్ తో తన నివాసానికి చేరుకున్నారు కవిత. కవితను చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీగా బస్తీ వాసులు తరలివచ్చారు.
Also Read : ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో వాళ్ల కట్టడాలుంటే వివరాలివ్వండి.. నేను దగ్గరుండి కూలగొట్టిస్తా : సీఎం రేవంత్ రెడ్డి
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కవితకు.. సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఐదున్నర నెలలు ఆమె తీహార్ జైల్లో ఉన్నారు. ఐదున్నర నెలల తర్వాత తెలంగాణ గడ్డపై అడుగుపెట్టారు కవిత. రేపు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్లి తన తండ్రి కేసీఆర్ ను కలవనున్నారు కవిత.