ODI World Cup : టీమ్ఇండియాను వేధిస్తున్న నంబ‌ర్ 4 స‌మ‌స్య‌.. ఎవరూ ఊహించని సజెషన్.. మేనేజ్‌మెంట్ అంగీక‌రించేనా..?

వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ (ODI World Cup)కు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డింది. స్వ‌దేశంలో జ‌ర‌గ‌నున్న ఈ మెగా టోర్నీలో టీమ్ఇండియా(Team India) ఫేవ‌రెట్ల‌లో ఒక‌టిగా బ‌రిలోకి దిగుతోంది.

ODI World Cup : టీమ్ఇండియాను వేధిస్తున్న నంబ‌ర్ 4 స‌మ‌స్య‌.. ఎవరూ ఊహించని సజెషన్.. మేనేజ్‌మెంట్ అంగీక‌రించేనా..?

Virat Kohli-Ravi Shastri

ODI World Cup 2023 : వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ (ODI World Cup)కు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డింది. స్వ‌దేశంలో జ‌ర‌గ‌నున్న ఈ మెగా టోర్నీలో టీమ్ఇండియా(Team India) ఫేవ‌రెట్ల‌లో ఒక‌టిగా బ‌రిలోకి దిగుతోంది. ఈ టోర్నీలో పాల్గొనే దాదాపు అన్ని జ‌ట్లు త‌మ తుది జ‌ట్టు ఆట‌గాళ్ల‌పై ఇప్ప‌టికే ఓ అంచ‌నాకు వ‌చ్చేశాయి. అయితే.. టీమ్ఇండియాకు మాత్రం ఇంకా స‌మ‌స్య‌లు వెంటాడుతున్నాయి. తుది కూర్పుపై ఇప్ప‌టి వ‌ర‌కు కూడా జ‌ట్టు మేనేజ్‌మెంట్‌కు ఓ స్ప‌ష్ట‌మైన అవ‌గాహ‌న లేకుండా పోయింది. ప్ర‌ధాన ఆట‌గాళ్ల గాయాల‌తో దూరం కావ‌డం, వాళ్లు ఫిట్‌నెస్ సాధిస్తారో లేదో అని ఎదురుచూస్తుంది.

మిగతా స్థానాల సంగ‌తి ఎలా ఉన్నా స‌రే గ‌త కొన్నాళ్లుగా టీమ్ఇండియాను నంబ‌ర్ 4 బ్యాట‌ర్ స‌మ‌స్య వేధిస్తోంది. గ‌త ప్ర‌పంచ‌క‌ప్‌లో కూడా ఈ స‌మ‌స్య‌తోనే భార‌త్ ఎక్కువ‌గా ఇబ్బంది ప‌డింది. యువ‌రాజ్ సింగ్ రిటైర్‌మెంట్ త‌రువాత ఆ స్థానాన్ని రిప్లేస్ చేసే స‌రైన ఆట‌గాడు ఇంత వ‌ర‌కు దొర‌క‌లేద‌ని స్వ‌యంగా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ అన్నాడంటే ప‌రిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. అయితే.. దీనికి టీమ్ఇండియా మాజీ హెచ్‌కోచ్ ర‌విశాస్త్రి ఓ ప‌రిష్కారాన్ని సూచిస్తున్నాడు. తాను చెప్పిన‌ట్లు చేస్తే భార‌త మిడిల్ ఆర్డ‌ర్ చాలా బ‌లంగా మారుతుంద‌ని చెప్పుకొచ్చాడు.

India vs Ireland T20 Series: పసికూనలే అనుకుంటే పరాభవం పలుకరించినట్లే..! ఆ ఐదుగురు ఆటగాళ్లపై టీమిండియా ఫోకస్ పెట్టాలి

ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డాలంటే ప‌రుగుల యంత్రం విరాట్ కోహ్లిని నంబ‌ర్ 4లో ఆడించ‌డం ఒక్క‌టే ప‌రిష్కారం అని తెలిపాడు. తాను భార‌త జ‌ట్టు హెడ్ కోచ్‌గా ఉన్న‌ప్పుడే ఈ స‌ల‌హా ఇచ్చాన‌ని, ఆ స‌మ‌యంలో ఇది అమ‌లు కాలేద‌ని చెప్పాడు. ఇక కోహ్లి సైతం నంబ‌ర్ 4లో ఆడ‌డానికి ఎల్ల‌ప్పుడూ సిద్ధంగా ఉంటాడ‌ని, గ‌త రెండు ప్ర‌పంచ‌క‌ప్‌ల‌లో సైతం ఇదే స‌ల‌హా ఇచ్చినట్లు గుర్తు చేసుకున్నాడు.

భార‌త టాప్ ఆర్డ‌ర్ చాలా బ‌లంగా ఉంద‌ని, మిడిల్ ఆర్డ‌రే ఇబ్బందిగా మారింద‌న్నాడు. టాపార్డ‌ర్‌లో రెండు, మూడు వికెట్లు పోతే టీమ్ఇండియా ఓడిపోతుంద‌ని, ఇది చాలా సార్లు నిరూప‌ణ అయ్యింద‌న్నాడు. విరాట్ ఇప్ప‌టి వ‌ర‌కు త‌న వ‌న్డే కెరీర్‌లో ఎక్కువ‌గా నంబ‌ర్ 3లో ఆడాడు. 265 ఇన్నింగ్స్‌లు ఆడ‌గా ఇందులో 210 ఇన్నింగ్స్‌లు నంబ‌ర్ 3 స్థానంలో ఆడి 10,777 ప‌రుగులు చేశాడు. ఇక నంబ‌ర్ 4లో 39 ఇన్నింగ్స్‌లు ఆడ‌గా 55 స‌గ‌టుతో 7 సెంచ‌రీలు స‌హా 1,767 ప‌రుగులు చేశాడు. విరాట్ కు నంబ‌ర్‌4లో కూడా మెరుగైన రికార్డు ఉండ‌డం వల్లే అత‌డిని ఈ స్థానంలో ఆడించాల‌ని సూచిస్తున్న‌ట్లు ర‌విశాస్త్రి తెలిపాడు. చూడాలి మ‌రీ భార‌త టీమ్ మేనేజ్‌మెంట్ ర‌విశాస్త్రి చేసిన సూచ‌న‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటుందో లేదో.

Asia Cup : ఓ సారి టీ20, మ‌రోసారి వ‌న్డే ఫార్మాట్‌.. ఇలా ఎందుకంటే..?