BJP: ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన బీజేపీ.. తెలంగాణ అభ్యర్థుల జాబితా ఎప్పుడంటే?

తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల జాబితాపై కూడా బీజేపీ అధిష్ఠానం దృష్టి పెట్టింది.

BJP: ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన బీజేపీ.. తెలంగాణ అభ్యర్థుల జాబితా ఎప్పుడంటే?

BJP

BJP – Madhya Pradesh: ఛత్తీస్‌గఢ్(Chhattisgarh), మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితాలను బీజేపీ ఇవాళ విడుదల చేసింది. మరి కొన్ని నెలల్లో ఆ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఛత్తీస్‌గఢ్‌లో 21 అసెంబ్లీ స్థానాలకు, మధ్యప్రదేశ్‌లో 39 అసెంబ్లీ స్థానాలకు పోటీచేసే మొదటి విడత అభ్యర్థుల జాబితా బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది.

నిన్న జరిగిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో అభ్యర్థులను ఖరారు చేశారు. ఛత్తీస్‌గఢ్ నుంచి పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితాలోమాజీ సీఎం రమణ్ సింగ్ పేరు లేదు. అలాగే, మధ్యప్రదేశ్ నుంచి పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితాలో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పేరు కనపడలేదు. ఛత్తీస్‌గఢ్ లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు, మధ్యప్రదేశ్ లో మొత్తం 230 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.

తెలంగాణ అభ్యర్థులు?
తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల జాబితాపై కూడా బీజేపీ అధిష్ఠానం దృష్టి పెట్టింది. సెప్టెంబరులో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించనుంది. పలుకుబడి ఉన్న నేతలకు టికెట్లు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల జరిగే బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో తెలంగాణ, రాజస్థాన్ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయనున్నారు.

KA Paul: ఆ ఎమ్మెల్యేని ఈ తొమ్మిదేళ్లలో నేను ఏనాడూ శపించలేదు.. ఇక క్షమించను: కేఏ పాల్