Operation Cheetah : 500 ట్రాప్ కెమెరాలు, 100మంది సిబ్బంది.. తిరుమలలో ముమ్మరంగా ఆపరేషన్‌ చిరుత

అడవిలో 300 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. మరో 200 కెమెరాలను టీటీడీ సమకూర్చనుంది. Tirumala - Operation Cheetah

Operation Cheetah : 500 ట్రాప్ కెమెరాలు, 100మంది సిబ్బంది.. తిరుమలలో ముమ్మరంగా ఆపరేషన్‌ చిరుత

Tirumala - Operation Cheetah

Tirumala – Operation Cheetah : తిరుమల నడకదారిలో చిన్నారిపై చిరుత దాడి చేసి చంపేసిన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీంతో టీటీడీ అలర్ట్ అయ్యింది. చిరుతలను బంధించే పనిలో పడింది. ఇందుకోసం ఆపరేషన్ చిరుత స్టార్ట్ చేసింది.

తిరుమలలో ఆపరేషన్ చిరుత ముమ్మరంగా సాగుతోంది. ఇవాళ(ఆగస్టు 17) బోనులో మరో చిరుత చిక్కగా ఇంకా 3 నుంచి 4 చిరుతలు నడక మార్గంలో తిరుగుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చిరుతల ఆపరేషన్ లో వందమంది అటవీశాఖ సిబ్బంది పాల్గొంటున్నారు.

500 ట్రాప్ కెమెరాలు, 10వేల ఊతకర్రలు..
అడవిలో 300 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. మరో 200 కెమెరాలను టీటీడీ సమకూర్చనుంది. శ్రీశైలం-నల్లమల నుంచి తిరుపతికి వచ్చిన ప్రత్యేక అటవీ అధికారుల బృందం కెమెరాలను బిగిస్తోంది. త్వరలో శేషాచలానికి మరిన్ని అధునాతన బోన్లు కూడా రానున్నాయి. అటు నంద్యాల నుంచి 10వేల ఊతకర్రలను టీటీడీ తెప్పించనుంది.(Operation Cheetah)

50 రోజుల్లో 3 చిరుతల పట్టివేత..
ఇటీవల అలిపిరి కాలినడక దారిలో చిరుత దాడిలో నెల్లూరు జిల్లాకు చెందిన ఆరేళ్ల బాలిక లక్షిత మృతి చెందిన తర్వాత చిరుతల పట్టివేత ఆపరేషన్ కొనసాగుతోంది. చిరుతలను బంధించేందుకు కాలినడక మార్గంలో మూడు చోట్ల బోన్లు ఏర్పాటు చేశారు. మోకాలి మిట్ట, లక్ష్మీనరసింహ స్వామి ఆలయం, 35వ మలుపు వద్ద బోన్లు ఉంచారు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం (ఆగస్టు 14) బోనులో ఓ చిరుత చిక్కగా తాజాగా ఇవాళ (ఆగస్టు 17) వేకువజామున మరో చిరుత చిక్కింది. 50 రోజుల వ్యవధిలో మూడు చిరుతలను బంధించినట్లు అటవీశాఖ అధికారులు చెప్పారు. జూన్ 24న ఓ చిరుతను, ఆగస్టు 14న రెండో చిరుతను, ఆగస్టు 17న మూడో చిరుతను బంధించారు.

Also Read..Tirumala Nadakadari : తిరుమల నడకమార్గంలో చిరుతల బెడద.. తగ్గుతున్న కాలినడక భక్తుల సంఖ్య

నడకదారిలో 5 చిరుతల సంచారం..
ఇటీవల చిన్నారిపై చిరుత దాడి ఘటనతో భక్తుల భద్రతపై టీటీడీ అప్రమత్తమైంది. ఇప్పటికే పలు నిబంధనలు తీసుకురాగా.. చిరుతల వేటకు చర్యలు చేపట్టింది. చిరుతలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను తిరుమలకు తెప్పించింది. నడకదారిలో 500 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేస్తోంది. చిరుతల కోసం వివిధ ప్రాంతాల్లో బోన్లను ఏర్పాటు చేశారు. నడకదారి మార్గంలో మొత్తం 5 చిరుతలు సంచరిస్తున్నట్లు గుర్తించిన అధికారులు వాటిని బంధించేందుకు ప్రయత్నిస్తున్నట్లు టీటీడీ విజిలెన్స్ అధికారులు వెల్లడించారు.

నడకదారిలో ఆంక్షలు అమలు..
తిరుమల కాలిబాటలో యాత్రికులను బెంబేలెత్తిస్తున్న చిరుతల పట్టివేత ఆపరేషన్ సక్సెస్ అవుతోంది. నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెంకు చెందిన వినోద్ కుమార్, శశికళ దంపతుల ఆరేళ్ల కుమార్తె లక్షితను చిరుత లాక్కెళ్లి దాడి చేసి చంపేసింది. ఈ ఘటన తర్వాత అటవీశాఖ అధికారులు ఘటన జరిగిన సమీపంలో బోను ఏర్పాటు చేశారు. ఇదే బోనులో ఈ నెల 14న చిరుత చిక్కింది. ఇప్పుడు లక్ష్మీనరసింహస్వామి ఆలయం సమీపంలో మరో చిరుత చిక్కింది. చిన్నారిపై దాడి ఘటన తర్వాత టీటీడీ అలర్ట్ అయ్యింది. నడకదారిలో భక్తుల భద్రతకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది. కఠిన నిబంధనలు తెచ్చింది.

మధ్యాహ్నం 2గంటల వరకే అనుమతి..
అలిపిరి నుంచి గాలిగోపురం, లక్ష్మీనరసింహ స్వామి ఆలయం, 38వ మలుపు ప్రాంతాలు కలిపి మొత్తం 5 చోట్ల చిరుతల సంచారం ఉన్నట్లు భక్తులను అప్రమత్తం చేసింది టీటీడీ. అందుకే 15ఏళ్ల లోపు పిల్లలున్న తల్లిదండ్రులను ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు మాత్రమే అలిపిరి, శ్రీవారి మెట్టు కాలినడక మార్గాల్లో అనుమతిస్తున్నారు. నడకదారిలో తరుచుగా చిరుతలు, ఎలుగుబంట్లు బెంబేలెతిస్తున్నాయి. మూడు రోజుల క్రితం లక్ష్మీనరసింహస్వామి ఆలయం సమీపంలో చిరుత కనిపించింది. దీంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. దీనికి తోడు మెట్ల మార్గంలో ఎలుగుబంటి ప్రత్యక్షమైంది. భక్తులు భయాందోళనకు గురయ్యారు.

Also Read..Leopard Trapped : తిరుమలలో బోనులో చిక్కిన మరో చిరుత .. 50రోజుల వ్యవధిలో మూడు చిరుతలు..

చిక్కుతున్న చిరుతలు..
ఒక చిరుత బోనుకి చిక్కింది అని ఆనందించేలోగానే మరొకటి ప్రత్యక్షం కావడంతో భక్తులు భయపడుతూనే ఉన్నారు. ఈ దశలో రెండో చిరుత చిక్కడం కాస్తంత ఊరట కలిగించే విషయం. వరుసగా చిరుతలు చిక్కడంతో అధికారులు కూడా ఊపిరిపీల్చుకుంటున్నారు. ఈ చిరుతలను దూరంగా అటవీ ప్రాంతంలో విడిచిపెట్టనున్నారు. జూన్ నెలలో కూడా ఓ చిన్నారిపై చిరుత దాడి చేసింది. అప్పుడు కూడా బోను ఏర్పాటు చేయగా చిరుత చిక్కింది. దాన్ని బంధించి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. క్రూరమృగాల సమస్య పరిష్కారం అయ్యే వరు భక్తులు సహకరించాలని టీటీడీ కోరుతోంది.