Dulquer Salmaan : సోనమ్ కపూర్ పై రానా వ్యాఖ్యలు.. స్పందించిన దుల్కర్ సల్మాన్..
కింగ్ అఫ్ కోత(King of Kotha) సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రానా(Rana) మాట్లాడుతూ ఓ బాలీవుడ్(Bollywood) హీరోయిన్ గురించి విమర్శలు చేశాడు. తాజాగా రానా చేసిన వ్యాఖ్యలపై దుల్కర్ స్పందించాడు.
Dulquer Salmaan : ఇటీవల దుల్కర్ సల్మాన్(Dulquer Salman) కింగ్ అఫ్ కోత(King of Kotha) సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా ఈ ఈవెంట్ లో రానా(Rana) మాట్లాడుతూ ఓ బాలీవుడ్(Bollywood) హీరోయిన్ గురించి విమర్శలు చేశాడు. దుల్కర్ తో ఓ బాలీవుడ్ హీరోయిన్ సినిమా చేసిందని, ఆమె సినిమా చేసేటప్పుడు దుల్కర్ ని చాలా ఇబ్బంది పెట్టిందని, షూటింగ్ మధ్యలో ఫోన్స్ మాట్లాడుకుంటుందని, ఈ విషయంలో నిర్మాతలని తిట్టానని రానా చెప్పాడు. అయితే ఆ బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ అని తెలిసింది. దీంతో రానా వ్యాఖ్యలు వైరల్ అవ్వగా ఇవి సోనమ్ వరకూ వెళ్లాయి. బాలీవుడ్ లో కూడా సోనమ్ ని విమర్శించిన రానా అని వార్తలు వచ్చాయి.
దీంతో రానా సోనమ్ కపూర్ కి, దుల్కర్ కి క్షమాపణలు చెప్తూ, వార్తలని నెగిటివ్ గా పబ్లిష్ చేసారంటూ ఓ ట్వీట్ కూడా చేశాడు. నేను మాట్లాడిన మాటలతో సోనమ్ పై బాగా వ్యతిరేకత చూపిస్తున్నారు. అది నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఆమె కూడా నా స్నేహితురాలే. సోనమ్ కపూర్ కి, దుల్కర్ సల్మాన్ కి నా హృదయపూర్వక క్షమాపణలు తెలియచేస్తున్నాను అంటూ రానా ట్వీట్ చేశాడు. దీనిపై సోనమ్ ఇండైరెక్ట్ గా ఓ కొటేషన్ కూడా పోస్ట్ చేసింది.
Rana Daggubati : మొన్న బాలీవుడ్ హీరోయిన్ని తిట్టి.. ఇవాళ క్షమాపణలు చెప్పిన రానా..
తాజాగా రానా చేసిన వ్యాఖ్యలపై దుల్కర్ స్పందించాడు. కింగ్ అఫ్ కొత్త ప్రమోషన్స్ లో దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. అవి రానా వ్యక్తిగత వ్యాఖ్యలు. నేను దానిపై మాట్లాడాలనుకోవట్లేదు. నాకు పరిశ్రమలో చాలా మంది మంచి స్నేహితులు ఉన్నారు. రానా కూడా ఒకరు. నేను ఎవరిపై కంప్లైంట్ చేయను. నా పని నేను చేసుకొని వెళ్ళిపోతాను. రానా ఆ విషయాన్ని కావాలని అయితే చెప్పి ఉండరు. స్టేజిపైకి వచ్చాక నా గురించి మాట్లాడుతూ చెప్పారు. అందుకే ఆయన తర్వాత క్షమాపణలు కూడా చెప్పారు అని అన్నారు.