Soft Drinks : రోజుకో గ్లాసు కూల్ డ్రింక్ సిప్ చేస్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త!

పండ్ల రసాలను తీసుకుంటే ముప్పు ఉండదని అందరికీ తెలుసు. కృత్రిమంగా తయారయ్యే ఏ పండ్ల రసం అయినా దీర్ఘకాలంలో చెడు చేస్తుందని ఈ పరిశోధన ద్వారా తేలింది.

Soft Drinks : రోజుకో గ్లాసు కూల్ డ్రింక్ సిప్ చేస్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త!

Sipping a glass of cool drink

Soft Drinks : ఎండాకాలం ఎవరైనా కూల్ డ్రింక్ తాగుతారు. అదే మాన్ సూన్మజాలో కూడా చల్లని.. కూల్.. కూల్.. కూల్ డ్రింక్ సిప్ చేయాలని చాలామందికి మనసు ఉవ్విళ్లూరుతుంటుంది. కానీ అది మీ లివర్ కి చేటు చేస్తుందని ఎప్పుడైనా ఊహించారా?

చల్లని సాయంత్రం వేళ వేడి.. వేడి.. బజ్జీలు, పునుగులు తినాలని చాలామందికి కోరిక కలుగుతుంది. వాటితో పాటు చల్లని నీళ్లు లేదా చల్లని కూల్ డ్రింక్ గొంతులోకి జారాలని కూడా అనిపిస్తుంటుంది. ముఖ్యంగా స్త్రీలలో ఈ టెండెన్సీ ఎక్కువ ఉంటుందని పరిశోధకులు గమనించారు. అందుకే వారి మీదే పరిశోధన జరిపారు.

READ ALSO : High Blood Pressure : హైబీపీ మీ గుండెను మాత్రమే కాదు.. మూత్రపిండాలు, కాలేయంపై కూడా ప్రభవం చూపిస్తుంది

అమ్మో.. క్యాన్సర్

యునైటెడ్ స్టేట్స్ లోని బ్రిగమ్, ఉమెన్స్ హాస్సిటల్ కి చెందిన భారతీయ పరిశోధకులు తీపి పానీయాలు రోజు తీసుకునే స్త్రీల మీద పరిశోధన జరిపారు. అంతేకాదు.. ఉమెన్స్ హెల్త్ ఇనిషియేటివ్ (డబ్ల్యూహెచ్ఐ) దాదాపు 98,876 మందిని అధ్యయనం చేశారు. అది కూడా రుతుక్రమం ఆగిపోయిన మహిళల మీద ఈ పరిశోధన చేశారు. మామూలుగానే రుతుక్రమం ఆగిపోయిన మహిళల్లో గుండెజబ్బులు, రొమ్ము క్యాన్సర్, కొలొరెక్టల్ క్యాన్సర్ వస్తాయని తేలింది. దీంతో పాటు ఈ శీతల పానీయాలు తీసుకునే వారిలో కాలేయ క్యాన్సర్ వస్తుందని నిర్ధారించారు.

READ ALSO : Rose Flowers Cultivation : గులాబీ పూల సాగుతో ప్రతినెల 70వేల నికర అదాయం పొందుతున్న రైతు

అధ్యయనం ప్రకారం..

20 ఏళ్ల పాటు డబ్ల్యూహెచ్ఐ ప్రతిరోజూ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ చక్కెర కలిసిన తీపి పానీయాలను అంటే కూల్ డ్రింక్స్ తాగుతున్నట్లు గమనించారు. వారిలో 6.8శాతం మంది మహిళల్లో కాలేయ క్యాన్సర్ ప్రమాదాన్ని గుర్తించారు. సుమారు 85శాతం మంది దీర్ఘకాలిక కాలేయ వ్యాధి మరణాలు సంభవించినట్లు గుర్తించారు. ఈ డేటాను నెలలో మూడు సార్ల కంటే తక్కువ తీసుకుంటే ఈ ప్రమాదం కొంత మేర దరిచేరదు.

READ ALSO : ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో తెలుసా ?

కృత్రిమ పండ్ల రసాలు వద్దు

పండ్ల రసాలను తీసుకుంటే ముప్పు ఉండదని అందరికీ తెలుసు. కృత్రిమంగా తయారయ్యే ఏ పండ్ల రసం అయినా దీర్ఘకాలంలో చెడు చేస్తుందని ఈ పరిశోధన ద్వారా తేలింది. ఫైబ్రోసిస్, సిర్రోసిస్ లేదా క్రానిక్హెపటైటిస్ వంటి దీర్ఘకాలిక కాలేయ వ్యాధుల వల్ల కాలేయ క్యాన్సర్ ప్రమాదం పొంచి ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇది పరిశీలనాత్మక అధ్యయనం మాత్రమే.

READ ALSO : Washington : అతనికి 88.. ఆమెకు 85.. 66 పెళ్లిరోజు మౌంట్ వాషింగ్టన్‌పై చేసుకున్న వృద్ధ జంట

అసలు కాలేయ క్యాన్సర్ రావడానికి శీతల పానీయాలు ఎలా కారణమవుతున్నాయని తెలుసుకోవడానికి మరింత పరిశోధనలు జరుగాలని పరిశోధకులు అంటున్నారు. ఏదైనా అతి సర్వత్రా వర్జయేత్ అన్నారు పెద్దలు. కాబట్టి ఏదైనా లిమిట్ దాటితే మాత్రం ప్రమాదం దీని విషయంలోనే కాదు.. ఏ విషయంలోనైనా తప్పదని గుర్తు పెట్టుకోండి. అవసరమైన మేరకు మాత్రమే కూల్ డ్రింక్స్ జోలికి వెళ్లండి. వీలైతే తాజా పండ్లు తినండి. అలా తినలేకపోతే ఫ్రెష్ గా జ్యూస్ చేసుకొని తాగేయండి.