Washington : అతనికి 88.. ఆమెకు 85.. 66 పెళ్లిరోజు మౌంట్ వాషింగ్టన్‌పై చేసుకున్న వృద్ధ జంట

80 సంవత్సరాలు దాటిన వృద్ధ జంట తమ పెళ్లిరోజును డిఫరెంట్‌గా జరుపుకున్నారు. అసలు ఆ వయసులో ఎవరూ చేయలేని సాహసం చేశారు. ఇంతకీ ఎక్కడ జరుపుకున్నారు?

Washington : అతనికి 88.. ఆమెకు 85.. 66 పెళ్లిరోజు మౌంట్ వాషింగ్టన్‌పై చేసుకున్న వృద్ధ జంట

Washington

Updated On : August 19, 2023 / 5:50 PM IST

Washington : 80 ఏళ్ల వయసంటే అడుగులు తడబడతాయి. కానీ ఓ వృద్ధ దంపతులు ఎంత యాక్టివ్ అంటే తమ 66 వ పెళ్లిరోజును మౌంట్ వాషింగ్టన్ అధిరోహించి అక్కడ గ్రాండ్‌గా జరుపుకున్నారు. ఆశ్చర్యం కలిగించినా ఇది నిజం.

Hyderabad Begging mafia : వృద్ధులతో భిక్షాటన చేయిస్తున్న అనిల్ .. దీంతో అతనికి వచ్చే ఆదాయం ఎంతో తెలుసా..?

ఇన్‌స్టాగ్రామ్ పేజ్ గుడ్‌న్యూస్ మూవ్‌మెంట్‌లో (goodnews_movement) పోస్ట్ చేసిన ఓ వీడియో అందరి మనసులు దోచుకుంది. న్యూ హాంప్‌షైర్‌లోని మౌంట్ వాషింగ్టన్‌ను అధిరోహిస్తున్న వృద్ధ జంట ఆ వీడియోలో కనిపించారు. ఈ పర్వతం ఈశాన్య యునైటెడ్ స్టేట్స్‌లో ఎత్తైన శిఖరం. దానిపై ఈ జంట వారి 66 వ పెళ్లిరోజు జరుపుకున్నారు. ‘హ్యాపీ యానివర్సరీ.. 88 మరియు 85 సంవత్సరాల వయసున్న ఈ జంట తమ 66 వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా మౌంట్ వాషింగ్టన్‌ను అధిరోహించారు. ఈ అందమైన క్షణాన్ని ప్రపంచంతో పంచుకున్నందుకు ధన్యవాదాలు’ అంటూ వీడియోకి క్యాప్షన్‌ను పోస్ట్ చేశారు.

Jailer : థియేటర్‌లో తమన్నాతో పోటీ పడి డ్యాన్స్ చేసిన వృద్ధుడు.. దద్దరిల్లిన సినిమా హాల్

ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. నెటిజన్లు చాలా ఫన్నీగా రెస్పాండ్ అయ్యారు. ‘నేను భోజనం చేసిన తర్వాత మెట్లెక్కి నా బెడ్ రూమ్ చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నాను’ అని.. ‘ఇంత అందమైన జంటను ఎక్కడా చూడలేదు’ అని కామెంట్లు చేశారు. వారికి లవ్ ఇమోజీలతో పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్పారు.

 

View this post on Instagram

 

A post shared by Good News Movement (@goodnews_movement)