Chennamaneni Ramesh: బీఆర్ఎస్ నుంచి టికెట్ దక్కకపోవడంతో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని కీలక ప్రకటన

తన పౌరసత్వంపై అక్టోబరులో అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఆ సమస్య తీరాక..

Chennamaneni Ramesh: బీఆర్ఎస్ నుంచి టికెట్ దక్కకపోవడంతో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని కీలక ప్రకటన

చెన్నమనేని రమేశ్ (Photo: Twitter)

Chennamaneni Ramesh – BRS: తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Sircilla district) వేములవాడ ఎమ్మెల్యే ( Vemulawada MLA), బీఆర్ఎస్ నేత చెన్నమనేని రమేశ్ బాబు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా? అన్న విషయంపై ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ పోటీ చేస్తే ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారన్న సందేహాల మధ్య చెన్నమనేని రమేశ్ ఇవాళ ఓ ప్రకటన విడుదల చేశారు.

చెన్నమేని రమేశ్‌ పౌరసత్వం వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. భారత పౌరసత్వానికి చెన్నమనేని రమేశ్ అనర్హుడని కేంద్ర హోంశాఖ గతంలో తెలిపింది. ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ వేములవాడ టికెట్ ను చెన్నమేని రమేశ్‌కు కాకుండా విద్యా సంస్థల అధిపతి చెలిమడ నరసింహారావుకి ఇచ్చారు.

దీనిపై చెన్నమనేని ప్రకటన విడుదల చేశారు. టికెట్ రాలేదని బాధ పడకూడదని తన మద్దతుదారులకు చెప్పారు. ప్రజాసేవ ద్వారానే నేతలు పోటీ చేసే అర్హతలు సంపాదించుకోవాలని చెప్పుకొచ్చారు. అభ్యర్థుల ఎంపికలో ప్రజాభిప్రాయంతో పాటు పార్టీ నేతల అభిప్రాయం అత్యంత కీలకమని చెప్పారు. లేదంటే ప్రజల మన్నలను పొందలేమని అన్నారు.

తన పౌరసత్వంపై అక్టోబరులో అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఆ సమస్య తీరాక ఆటంకాలు ఉండవని చెప్పారు. సర్వేల ఆధారంగా ఉత్తమంగా పనిచేశామనని కేసీఆర్ చెప్పారని, అదే దశాబ్ద కాల తమ నిస్వార్థ ప్రజా సేవకు నిదర్శనమని చెప్పుకొచ్చారు. వేములవాడ ప్రజలతో సుధీర్ఘ రాజకీయ పేగుబంధం పెనవేసుకుందని అన్నారు. ఇది తన ఊపిరి ఉన్నంత వరకు కొనసాగుతుందని చెప్పారు. కలిసికట్టుగా భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించుకుందామని చెప్పారు.

Jupally Krishna Rao: అందుకే కేసీఆర్‌కి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి తన దెబ్బ రుచి చూపించాలి: జూపల్లి కృష్ణారావు