Chandrayaan3: చంద్రయాన్-3కి విదేశీ నిధులెందుకంటూ బ్రిటన్ న్యూస్ ఛానల్ అక్కసు.. అదే స్టైల్లో తిరిగిచ్చేస్తున్న ఇండియన్లు

‘‘@PatrickChristys చంద్రుని మిషన్‌పై వారి విజయవంతమైన అభినందనలకు భారతదేశాన్ని అభినందించారు. కానీ నియమం ప్రకారం, మీరు చంద్రుని మీద ఉండే చీకటిలోకి రాకెట్‌ను పంపగలిగినప్పుడు, విదేశీ సహాయం కోసం మమ్మల్ని సంప్రదించకూడదు!’’ అని ట్వీట్ చేశారు

Chandrayaan3: చంద్రయాన్-3కి విదేశీ నిధులెందుకంటూ బ్రిటన్ న్యూస్ ఛానల్ అక్కసు.. అదే స్టైల్లో తిరిగిచ్చేస్తున్న ఇండియన్లు

UK News Anchor on Chandrayaan3: ఆగస్టు 23వ తేదీ బుధవారం ఇస్రోకు కోట్లాది మంది భారతీయులకు మరపురాని సాయంత్రం. చంద్రుని దక్షిణ ధ్రువంపై భారత పరిశోధక సంస్థ ఇస్రో రూపొందించిన చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండ్ అయింది. దేశ, విదేశాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, బ్రిటీష్ జర్నలిస్టు సోఫీ కోర్కోరాన్ కొత్త కాంట్రవర్సీకి తెర లేపారు. సోషల్ మీడియాలో ఆయన చేసిన ట్వీట్‌ ఇందుకు కారణమైంది. సోఫీ తన ట్వీట్‌లో ‘‘భారత అంతరిక్ష సంస్థకు ఇచ్చిన సహాయం మొత్తాన్ని బ్రిటన్ డిమాండ్ చేసింది. కోహినూర్ వజ్రాన్ని డిమాండ్ చేసింది’’ అని రాసుకొచ్చారు.

CM KCR : కేసీఆర్‌పై కమల వ్యూహం,గజ్వేల్‌లో ఈటల,కామారెడ్డిలో విజయశాంతి.. గులాబీ బాస్‌పై పోటీకి సై అంటున్న నేతలు

తన ఎక్స్ (ట్విట్టర్) ద్వారా స్పందిస్తూ.. ‘‘బ్రిటన్ అధునాతన అంతరిక్ష కార్యక్రమాన్ని కలిగి ఉన్నందున భారతదేశానికి సహాయం పంపకూడదు. మేము మా డబ్బును తిరిగి పొందే సమయం వచ్చింది. మా 2.3 బిలియన్ యూరోలను భారతదేశం మాకు తిరిగి ఇవ్వండి!’’ అని పోస్ట్ చేశారు. బ్రిటీష్ వార్తా ఛానెల్ అయిన జీబీ న్యూస్ ప్రెజెంటర్. అయితే జీబీ న్యూస్ సైతం అదే తరహాలో స్పందించడం గమనార్హం. వారి ఎక్స్ ఖాతాలో.. ‘‘@PatrickChristys చంద్రుని మిషన్‌పై వారి విజయవంతమైన అభినందనలకు భారతదేశాన్ని అభినందించారు. కానీ నియమం ప్రకారం, మీరు చంద్రుని మీద ఉండే చీకటిలోకి రాకెట్‌ను పంపగలిగినప్పుడు, విదేశీ సహాయం కోసం మమ్మల్ని సంప్రదించకూడదు!’’ అని ట్వీట్ చేశారు. ఈ రెండు ట్వీట్లు క్షణాల్లో వైరల్ అయ్యాయి.

Jio Bharat Phone Sale : రిలయన్స్ జియో యూజర్లకు గుడ్ న్యూస్.. అమెజాన్‌లో జియో భారత్ ఫోన్ సేల్.. ఎప్పటినుంచంటే? గెట్ రెడీ..!

ఈ రెండు ట్వీట్లపై భారతీయులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘మీరు భారతదేశం నుంచి దోచుకున్న 45 ట్రిలియన్ డాలర్ల నుంచి ఆ మొత్తం తీసివేయండి’’ అని కొ యూజర్ రాసుకొచ్చారు. ‘‘మా కోహినూర్‌ను తిరిగి ఇచ్చేయండి’’ అని మరొక యూజర్ స్పందించారు. ఆర్థికవేత్త ఉత్సా పట్నాయక్ చేసిన పరిశోధనను, కొలంబియా యూనివర్సిటీ ప్రెస్ ప్రచురించిన నివేదికను కొందరు నెట్టింట్లో పంచుకుంటున్నారు. ఆర్థికవేత్త ఉత్సా పట్నాయక్ అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. ఆయన తన నివేదికలో, ‘‘1765-1938 మధ్య, బ్రిటిష్ వారు భారతదేశం నుంచి దాదాపు 45 ట్రిలియన్ డాలర్లు దోచుకున్నారు. ఈ మొత్తం బ్రిటన్ యొక్క స్థూల దేశీయోత్పత్తి (GDP) కంటే 15 రెట్లు ఎక్కువ’’ అని రాసుకొచ్చారు.