Kalki 2898 AD : ప్రభాస్ ‘కల్కి’ సంక్రాంతికి వస్తుందా..? నిర్మాత అశ్వినీ దత్ ఏం చెప్పాడు..?

ఇంటర్వ్యూలో పాల్గొన్న కల్కి నిర్మాత అశ్వినీ దత్.. మూవీ అప్డేట్ అండ్ రిలీజ్ డేట్ పై కీలక వ్యాఖ్యలు చేశాడు.

Kalki 2898 AD : ప్రభాస్ ‘కల్కి’ సంక్రాంతికి వస్తుందా..? నిర్మాత అశ్వినీ దత్ ఏం చెప్పాడు..?

Aswani Dutt comments Prabhas Kalki 2898 AD update and release date

Kalki 2898 AD : నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas) హీరోగా చేస్తున్న సినిమా ‘కల్కి’. కమల్ హాసన్ (Kamal Haasan) విలన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకొనే(Deepika Padukone), అమితాబ్(Amitabh Bachchan), దిశా పటాని(Disha Patani) వంటి బడా స్టార్స్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో సి అశ్వినీ దత్ ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. కాగా ఈ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.

Kalki 2898 AD : ‘కల్కి’ని వందల కోట్లు ఖర్చుపెట్టి నిర్మిస్తున్నా.. కానీ అవుట్ చూసి.. నిర్మాత అశ్వినీ దత్!

అయితే ఈ చిత్రం అప్పటికి రావడం కష్టమంటూ ఫిలిం వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా దీని పై నిర్మాత అశ్వినీ దత్ స్పదించాడు. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అశ్వినీ దత్ మాట్లాడుతూ.. “మేము సినిమాని సంక్రాంతికి తీసుకు రావడానికే ప్రయత్నిస్తున్నాము. అయితే గ్రాఫిక్స్ కంపెనీస్ నుంచి కొంచెం గ్రీన్ సిగ్నల్ రావాలి. ఈ గ్రాఫిక్స్ వర్క్స్ పలు దేశాల్లో జరుగుతున్నాయి. వాళ్ళ నుంచి ఈ రెండు నెలల్లో రిలీజ్ సిగ్నల్ వస్తే.. కచ్చితంగా జనవరి 12 మూవీ రిలీజ్ అయ్యిపోతుంది” అంటూ చెప్పుకొచ్చాడు.

Kollywood : వారసులు అంతా కలిసి సినిమా చేయబోతున్నారా..? కోలీవుడ్‌లో హాట్ టాపిక్..!

నిర్మాత మాటలు వింటుంటే.. జనవరికి ఈ సినిమా రావడం కష్టమనే తెలుస్తుంది. ఇది ప్రభాస్ అభిమానులను కొంత నిరాశకు గురి చేస్తుంది. కాగా ఈ మూవీ గ్రాఫిక్స్ విషయం గురించిన వివరాలు కూడా అశ్వినీ దత్ తెలియజేశాడు. గ్రాఫిక్స్ చాలా అద్భుతంగా వస్తున్నాయని, డబ్బులు పెట్టి చేయించుకుంటున్న తానే అవుట్ ఫుట్ చూసి ఆశ్చర్యపోయినట్లు పేర్కొన్నాడు. అలాగే కమల్ హాసన్ పై లుక్ టెస్ట్ కూడా పూర్తి అయ్యినట్లు, సెప్టెంబర్ సెకండ్ వీక్ నుంచి కమల్ సెట్స్ లోకి రానున్నాడని తెలియజేశాడు. దాదాపు నెల రోజులు పాటు కమల్ తో షెడ్యూల్ ఉంటుందని వెల్లడించాడు.