Heath Streak : బతికే ఉన్నానన్న 10 రోజుల‌కే.. జింబాబ్వే దిగ్గ‌జ క్రికెట‌ర్ హీత్ స్ట్రీక్ క‌న్నుమూత‌..

జింబాబ్వే క్రికెట్‌లో పెను విషాదం చోటు చేసుకుంది. ఆ దేశ దిగ్గ‌జ ఆట‌గాడు హీత్ స్ట్రీక్ (Heath Streak) క‌న్నుమూశాడు.

Heath Streak : బతికే ఉన్నానన్న 10 రోజుల‌కే.. జింబాబ్వే దిగ్గ‌జ క్రికెట‌ర్ హీత్ స్ట్రీక్ క‌న్నుమూత‌..

Heath Streak passed away

Heath Streak passed away : జింబాబ్వే క్రికెట్‌లో పెను విషాదం చోటు చేసుకుంది. ఆ దేశ దిగ్గ‌జ ఆట‌గాడు హీత్ స్ట్రీక్ (Heath Streak) క‌న్నుమూశాడు. గ‌త కొంత కాలంగా క్యాన్స‌ర్ వ్యాధితో పోరాడుతున్న స్ట్రీక్ ఈరోజు(సెప్టెంబ‌ర్ 3 ఆదివారం) తెల్ల‌వారుజామున తుది శ్వాస విడిచారు. అత‌డి భార్య నాడిన్ సోష‌ల్ మీడియా ద్వారా ఈ విష‌యాన్ని ధ్రువీక‌రించారు.

‘ఈ రోజు తెల్ల‌వారుజామున నా జీవితంలో స‌గం, నా చిన్నారుల‌ తండ్రి మ‌మ్మ‌ల్ని విడిచి తిరిగి రాని లోకాల‌కు వెళ్లిపోయారు. చివ‌రి రోజుల్లో స్ట్రీక్.. కుటుంబ స‌భ్యులు, అత్యంత స‌న్నిహితుల‌తో ఆనందంగా గ‌డ‌పాల‌ని కోరుకున్నారు. ఆయ‌న మాతో గ‌డిపిన క్ష‌ణాల‌ను ఎన్న‌టికీ మ‌రిచిపోలేను. మ‌రో జ‌న్మంటూ ఉంటే ఆ జ‌న్మ‌లో కూడా నీ భార్య‌గానే పుట్టాల‌ని కోరుకుంటున్నా.’ అంటూ నాడిన్ ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొంది.

Rinku Singh : సూప‌ర్ ఓవ‌ర్‌లో రింకూ సింగ్ పెను విధ్వంసం.. హ్యాట్రిక్ సిక్స‌ర్లు.. వీడియో వైర‌ల్‌

కాగా.. 10 రోజుల క్రితం హీత్ స్ట్రీక్ చ‌నిపోయాడంటూ అత‌డి స‌హ‌చ‌ర ఆట‌గాడు హెన్రీ ఒలంగ చేసిన ట్వీట్ గంద‌ర‌గోళానికి దారి తీసిన సంగ‌తి తెలిసిందే. కొంచెం స‌మ‌యం త‌రువాత అత‌డు బ‌తికే ఉన్నాడ‌ని మ‌రో ట్వీట్ చేసి త‌న త‌ప్పును స‌రిదిద్దుకున్నాడు ఒలంగ‌. మొద‌టి సారి ఒలంగ ట్వీట్ త‌రువాత తాను బ‌తికే ఉన్నాన‌ని ఈ వార్త‌లు అబ‌ద్ద‌మ‌ని స్వ‌యంగా హీత్ స్ట్రీక్ ప్ర‌క‌టించాడు. త‌న‌కు క్ష‌మాప‌ణ‌లు కూడా చెప్పాల‌ని డిమాండ్ చేశారు. అయితే.. ఇప్పుడు స్ట్రీక్ నిజంగా తిరిగి రాని లోకాల‌కు వెళ్లిపోయాడు.

BCCI Media Rights: బీసీసీఐకి డబ్బేడబ్బు.. వచ్చే ఐదేళ్ల కాలానికి ఆరువేల కోట్లు .. ఒక్కో మ్యాచ్ విలువ 67.76కోట్లు

హీత్‌ స్ట్రీక్ జింబాబ్వే త‌రుపున‌ 65 టెస్టులు,189 వ‌న్డేలు ఆడాడు. రెండు ఫార్మాట్ల‌ల‌లో 4,933 ప‌రుగులు చేయ‌డంతో పాటు 455 వికెట్లు తీశాడు. ఇప్ప‌టికీ కూడా జింబాబ్వే త‌రుపున టెస్టుల్లో 1000 ప‌రుగులు, 100 వికెట్లు, 2వేల ప‌రుగులు, 200 వికెట్లు తీసిన ఆట‌గాడి రికార్డు అత‌డి పేరిటే ఉంది. 1993లో అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన స్ట్రీక్ 2005లో వీడ్కోలు ప‌లికాడు. క్రికెట్ నుంచి రిటైర్‌మెంట్ త‌రువాత జింబాబ్వే, స్కాట్లాండ్‌, బంగ్లాదేశ్‌, గుజ‌రాత్ ల‌య‌న్స్‌, కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ జ‌ట్ల‌కు కోచ్‌గా వ్య‌వ‌హ‌రించాడు.