Priyanka Jain : బిగ్‌బాస్ సీజన్ 7 లో మొదటి కంటెస్టెంట్.. ప్రియాంక జైన్ గురించి తెలుసా?

ఈసారి బిగ్‌బాస్ సీజన్ 7లోకి మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ వచ్చారు. ఇందులో కొంతమంది అందరికి తెలిసిన వాళ్ళు ఉండగా కొంతమంది మాత్రం సోషల్ మీడియాలో మాత్రమే పాపులారిటీ తెచ్చుకున్న వాళ్ళని తీసుకొచ్చారు. బిగ్‌బాస్ సీజన్ 7లో మొదటి కంటెస్టెంట్ గా నటి ప్రియాంక జైన్ వచ్చింది.

Priyanka Jain : బిగ్‌బాస్ సీజన్ 7 లో మొదటి కంటెస్టెంట్.. ప్రియాంక జైన్ గురించి తెలుసా?

Bigg Boss Season 7 Telugu first contestant Priyanka Jain full details here

Priyanka Jain :  తెలుగు పాపులర్ రియాల్టీ షో బిగ్‌బాస్(BiggBoss) సీజన్ 7 కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు, షో ప్రేక్షకుల ఎదురు చూపులకు తెర పడింది. నిన్న సెప్టెంబర్ 3 ఆదివారం నాడు బిగ్‌బాస్ సీజన్(Bigg Boss Season 7) గ్రాండ్ గా మొదలైంది. ఈసారి కూడా నాగార్జునే (Nagarjuna) బిగ్ బాస్ హోస్ట్గా చేస్తున్నారు. బిగ్‌బాస్ సీజన్ 7 స్పెషల్ పర్ఫార్మెన్స్ లతో, సెలబ్రిటీ గెస్ట్ లతో గ్రాండ్ గా మొదలైంది. ఇక ఇవాల్టినుంచి సోమవారం టు శుక్రవారం.. రాత్రి 9.30 గంటలకు, శని, ఆది వారాల్లో రాత్రి 9 గంటలకు బిగ్‌బాస్ షో స్టార్ మా (Star Maa) ఛానల్ లో ఎంటర్టైన్ చేయనుంది. అలాగే డిస్నిప్లస్ హాట్ స్టార్ (Disney Plus Hotstar) లో 24 గంటలు లైవ్ తో స్ట్రీమ్ కానుంది.

ఈసారి బిగ్‌బాస్ సీజన్ 7లోకి మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ వచ్చారు. ఇందులో కొంతమంది అందరికి తెలిసిన వాళ్ళు ఉండగా కొంతమంది మాత్రం సోషల్ మీడియాలో మాత్రమే పాపులారిటీ తెచ్చుకున్న వాళ్ళని తీసుకొచ్చారు. బిగ్‌బాస్ సీజన్ 7లో మొదటి కంటెస్టెంట్ గా నటి ప్రియాంక జైన్ వచ్చింది.

ప్రియాంక జైన్ ది బెంగుళూరు. ఈ కన్నడ భామ మొదట తమిళ్ లో, కన్నడంలో కొన్ని సినిమాలు చేసింది. తెలుగులో కూడా చల్తే చల్తే అనే ఓ సినిమాలో హీరోయిన్ గా చేసింది. కానీ సినిమాల్లో ఎక్కువ ఆఫర్స్ రాకపోవడంతో టీవీ బాట పట్టింది. తెలివిజన్స్ లో సీరియల్స్ లో హీరోయిన్ రోల్స్ చేయడం మొదలుపెట్టింది. మొదట కన్నడలో పలు సీరియల్స్ లో నటించిన ప్రియాంక జైన్ ఇప్పుడు తెలుగులో ఫుల్ ఫామ్ లో ఉంది.

Bigg Boss 7 : బిగ్‌బాస్ సీజన్ 7 మొదలు అయ్యిపోయింది.. కంటెస్టెంట్స్ వీరే..

మౌనరాగం, జానకి కలగనలేదు అనే సీరియల్స్ లో ముఖ్య పాత్రల్లో నటిస్తూ ప్రియాంక జైన్ ఫుల్ బిజీగా ఉంది. తెలుగులో సీరియల్స్ తో మంచి పాపులారిటీ తెచ్చుకుంది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ఫాలోవర్స్ ని కూడా పెంచుకుంది. యూట్యూబ్ లో ఓ ఛానల్ తో కూడా ప్రేక్షకులని అలరిస్తుంది. పలు టీవీ షోలలో కూడా తమ పర్ఫార్మెన్స్ లతో దరగొడుతుంది ప్రియాంక. బయట, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రియాంక జైన్ మరి బిగ్ బాస్ హౌస్ లో ఎంత యాక్టివ్ గా ఉంటుందో చూడాలి. ఇక ప్రియాంక శివకుమార్ అనే నటుడితో ప్రేమలో ఉంది. తన ప్రేమ గురించి అధికారికంగానే తెలియచేసి వీరిద్దరి ఫోటోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంది.