Harish Shankar : పూరి జగన్నాథ్ చెప్తే ‘మిచ్చర్ బచ్చన్’ ను పోస్ట్‌పోన్ చేస్తారా..? దర్శకుడు హరీశ్ శంకర్ సమాధానం ఏంటంటే..?
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న చిత్రం 'మిస్టర్ బచ్చన్'.

Harish Shankar Speech in MR Bachchan movie teaser launch event
Harish Shankar – Mr Bachchan : మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మిస్తోంది. ‘మిరపకాయ్’ సినిమా తరువాత వీరిద్దరి కాంబోలో వస్తున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఆగస్టు 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఆదివారం టీజర్ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఇక దర్శకుడు పూరి జగన్నాధ్, హీరో రామ్ పోతినేనిల ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ కూడా ఆగస్టు 15నే విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘మిస్టర్ బచ్చన్’ టీజర్ కార్యక్రమంలో దర్శకుడు హరీశ్ శంకర్‌కు దీనిపై ప్రశ్నలు ఎదురయ్యాయి. దర్శకుడు పూరీ జగన్నాథ్ మీకు ఫోన్ చేసి.. సినిమాను ఓ రెండు మూడు రోజులు పోస్ట్ పోన్ చేసుకోమని చెబితే మీ మిస్టర్ బచ్చన్ సినిమాను విడుదలను వాయిదా వేస్తారా అని ఓ విలేకరి ప్రశ్నించారు.
దీనికి హరీశ్ శంకర్ ఇలా సమాధానం చెప్పారు. పూరీతో మీకున్న రిలేషన్ కంటే నా రిలేషన్ ఎక్కువ. సో.. ఆయన గనుక ఓ విషయాన్ని కాల్ చేసి చెబుతున్నారంటే… అది పర్సనల్‌గా మా ఇద్దరి విషయం అవుతుందని చెప్పారు. తనకు తెలిసి ఓ 90 శాతం వరకు పూరీ జగన్నాథ్ అలా ఫోన్ చేయరని అన్నారు. కాంట్రవర్సీ రౌండ్‌లోకి వెళ్లిన తరువాత ఈ ప్రశ్నకు సమాధానం చెబుతానంటూ సదరు ప్రశ్నకు హరీశ్ శంకర్ చాలా నైస్‌గా సమాధానం చెప్పకుండా దాటవేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పూరి జగన్నాథ్ చెప్తే సినిమా పోస్ట్‌పోన్ చేసుకుంటారా..?#MrBachchan #RaviTeja #HarishShankar #BhagyashriBorse #10TV pic.twitter.com/e81vZZ2JzO
— 10Tv News (@10TvTeluguNews) July 29, 2024