జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట

మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరేన్‌కు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది.

జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట

Supreme Court rejects Enforcement Directorate plea against Hemant Soren bail

Updated On : July 29, 2024 / 2:13 PM IST

Hemant Soren bail: జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట దక్కింది. మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరేన్‌కు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. సొరేన్‌కు బెయిల్ ఇస్తూ జార్ఖండ్ హైకోర్టు వెలువరించిన తీర్పు చాలా సహేతుకమైనదని జస్టిస్ బాఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథన్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. హైకోర్టు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని బెయిల్ ఇచ్చిందని అభిప్రాయపడింది. హేమంత్ సోరేన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.

భూ కుంభకోణం కేసులో జనవరి 31న హేమంత్ సొరేన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్‌ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. హేమంత్ సొరేన్‌కు జార్ఖండ్ హైకోర్టు జూన్ 28న బెయిల్ మంజూరు చేసింది. జైలు నుంచి విడుదలైన తరువాత జూలై 4న జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు.

Also Read: ఢిల్లీ కోచింగ్‌ సెంటర్‌‌లో ముగ్గురు విద్యార్థుల మృతి ఘటన.. బయటికొచ్చిన మరో వీడియో