India Name Change: ఇండియా పేరు మార్పుపై పిటిషన్‭ను కొట్టివేస్తూ సూటిగా ఓ ప్రశ్న అడిగిన సుప్రీంకోర్టు

ఈ డిమాండ్‌ను సంబంధిత మంత్రిత్వ శాఖకు పంపడానికి అనుమతించాలని పిటిషనర్ సుప్రీంకోర్టును కోరగా, దానిని సుప్రీంకోర్టు అంగీకరించింది. పిటిషన్‌లో రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 ప్రస్తావించారు. దీనిలో ఇండియా పేరు ఉపయోగించారు. పిటిషనర్ ఈ ఆర్టికల్‌ను సవరించాలని డిమాండ్ చేశారు.

India Name Change: ఇండియా పేరు మార్పుపై పిటిషన్‭ను కొట్టివేస్తూ సూటిగా ఓ ప్రశ్న అడిగిన సుప్రీంకోర్టు

Supreme Court: భారతదేశం పేరుపై కొత్త చర్చ మొదలైంది. ప్రతిపక్షాలు తమ కొత్త కూటమికి I.N.D.I.A అని పేరు పెట్టాయి. అలా ఉంచి ఇప్పుడు ఈ పదాన్నే తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. G-20 శిఖరాగ్ర సమావేశానికి సంబంధించిన ఆహ్వాన పత్రంలో ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’ అని కాకుండా ‘ప్రెసిండెంట్ ఆఫ్ భారత్’ అని రాశారు. దీని కారణంగా వివాదం మొదలైంది. అయితే మూడేళ్ల క్రితం ఇండియా పేరు మార్చాలన్న పిటిషన్ సుప్రీంకోర్టులో తిరస్కరణకు గురైందనే విషయం మీకు తెలుసా?

సుప్రీంకోర్టు ఏం చెప్పింది?
నిజానికి, సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది, అందులో ఇండియా అనే పేరును భారతదేశంగా మార్చడానికి రాజ్యాంగాన్ని సవరించాలని పేర్కొంది. గ్రీకు పదం ఇండికా నుంచి ఇండియా వచ్చిందని, అందుకే ఈ పేరును తొలగించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఇండియా అంటే భారత్ అని స్పష్టం చేసింది. అప్పటి ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బాబ్డే ఈ పిటిషన్‌ను తిరస్కరించి, ‘ఇండియా అంటే భారత్’ అని రాజ్యాంగంలో స్పష్టంగా రాసి ఉండగా, పిటిషనర్ ఈ విషయాన్ని కోర్టులో ఎందుకు లేవనెత్తారని అన్నారు.

రాజ్యాంగంలో సవరణ చేయాలని డిమాండ్‌
కాగా, ఈ డిమాండ్‌ను సంబంధిత మంత్రిత్వ శాఖకు పంపడానికి అనుమతించాలని పిటిషనర్ సుప్రీంకోర్టును కోరగా, దానిని సుప్రీంకోర్టు అంగీకరించింది. పిటిషన్‌లో రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 ప్రస్తావించారు. దీనిలో ఇండియా పేరు ఉపయోగించారు. పిటిషనర్ ఈ ఆర్టికల్‌ను సవరించాలని డిమాండ్ చేశారు. అనంతరం మరోసారి ఇండియా అనే పదానికి సంబంధించి రచ్చ మొదలైంది. రాష్ట్రపతి ఆహ్వాన లేఖ వెలువడిన తర్వాత పలువురు విపక్ష నేతలు మోదీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. రేపు ఏదైనా కూటమికి భారత్ అని పేరు పెడితే, దాన్ని కూడా బీజేపీ మారుస్తుందా అని ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి.