Chandramukhi 2: వినాయక చవితి వేళ ‘చంద్రముఖి-2’ని చూసే అదృష్టం ఇక లేనట్లే..

వినాయ‌క చ‌వితి సందర్భంగా సెప్టెంబరు 15న ఈ సినిమాను విడుదల చేస్తామని ముందుగా ఆ మూవీ యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే.

Chandramukhi 2: వినాయక చవితి వేళ ‘చంద్రముఖి-2’ని చూసే అదృష్టం ఇక లేనట్లే..

Chandramukhi 2

Chandramukhi 2 – Update: పి.వాసు దర్శకత్వంలో రాఘవ లారెన్స్(Raghava Lawrence), కంగనా రనౌత్ (Kangana Ranaut) ప్రధాన పాత్రల్లో రూపుదిద్దుకుంటున్న చంద్రముఖి 2 సినిమా విడుదల వాయిదా పడింది. వినాయ‌క చ‌వితి సందర్భంగా సెప్టెంబరు 15న ఈ సినిమాను విడుదల చేస్తామని ముందుగా ఆ మూవీ యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే, వీఎఫ్ఎక్స్ వర్క్ పెండింగ్ ఉండడం, అది ఇంకా పూర్తి కాకపోవడంతో ఈ సినిమాను సెప్టెంబరు 28న విడుదల చేస్తామని ఆ సినిమా యూనిట్ తెలిపింది. లైకా ప్రొడ‌క్ష‌న్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఎంఎం కీర‌వాణి బాణీలు సమకూర్చారు. రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ తో పాటు వ‌డివేలు, ల‌క్ష్మీ మీన‌న్‌, మ‌హిమా నంబియార్‌, రాధికా శ‌ర‌త్ కుమార్‌ తదితరులు నటిస్తున్నారు.

అప్పట్లో వచ్చిన చంద్రముఖి-1 ఎంతటి భారీ విజయాన్ని సాధించిందో తెలిసిందే. దీంతో చంద్రముఖి-2 సినిమాపై అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. చంద్రముఖి-1 సినిమాకి సీక్వెల్‍గా చంద్రముఖి 2 వస్తోంది. చంద్రముఖి-2 ట్రైలర్ ప్రేక్షకులకు బాగా ఆకట్టుకుంది.
Producer Ravindran arrested : చీటింగ్ కేసులో అరెస్టైన ప్రముఖ నిర్మాత