Turkish Court : ముగ్గురు అన్నదమ్ముళ్లకు 11,196 సంవత్సరాల జైలు శిక్ష.. తుర్కియే కోర్టు సంచలన తీర్పు

ఓజర్ దాదాపు 2 బిలియన్ డాలర్ల 30 మిలియన్ డాలర్లను రహస్య ఖాతాలకు తరలించారని ఆరోపించింది. వాదోపవాదాల తర్వాత ఓజర్ తోపాటు ఆయన సోదరులు సెరప్, గవెన్ దోషులను కోర్టు నిర్ధారించారు.

Turkish Court : ముగ్గురు అన్నదమ్ముళ్లకు 11,196 సంవత్సరాల జైలు శిక్ష.. తుర్కియే కోర్టు సంచలన తీర్పు

Turkish Court Sensational Judgment

Turkish Court Sensational Judgment : తుర్కియే కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మనీలాండరింగ్ కేసులో ముగ్గురు అన్నదమ్ముళ్లకు తుర్కియేలోని ఓ కోర్టు ఏకంగా 11,196 సంవత్సరాల చొప్పున జైలు శిక్ష విధించింది. వీరిలో క్రిప్టో బిజినెస్ వ్యవస్థాపకుడికి 40,562 సంవత్సరాల జైలు శిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ కోరారు.

థోడెక్స్ అనే పేరుతో క్రిప్టో బిబిజెస్ ను స్థాపించిన ఫరూఖ్ ఫతిహ్ ఓజర్(29) మనీలాండరింగ్ కు పాల్పడినట్లు ప్రాసిక్యూషన్ ఆరోపించింది. ఆయన మోసాలకు పాల్పడ్డారని, క్రిమినల్ ఆర్గనైజేషన్ ను ఏర్పాటు చేశారని తెలిపారు.

Thailand : దంపతులకు 12,640 ఏళ్ల జైలు శిక్ష.. థాయ్ లాండ్ కోర్టు సంచలన తీర్పు

ఓజర్ దాదాపు 2 బిలియన్ డాలర్ల 30 మిలియన్ డాలర్లను రహస్య ఖాతాలకు తరలించారని ఆరోపించింది. వాదోపవాదాల తర్వాత ఓజర్ తోపాటు ఆయన సోదరులు సెరప్, గవెన్ దోషులను కోర్టు నిర్ధారించారు. ఒక్కొక్కరికి 11,196 ఏళ్ల చొప్పున జైలు శిక్ష విధించింది.