iPhone 15 Price: అందుబాటులో ఐఫోన్ 15 ధరలు.. Pro Max తప్ప పెరగని ధరలు.. ఐఫోన్ లవర్స్ కు పండగే!

ఐఫోన్ లవర్స్ కు గుడ్ న్యూస్. లేటెస్ట్ గా లాంచ్ అయిన iPhone 15 ధరలు ఏమాత్రం పెరగలేదు. గత మోడల్ ధరలకే కొత్త ఫోన్లను సొంతం చేసుకోవచ్చు.

iPhone 15 Price: అందుబాటులో ఐఫోన్ 15 ధరలు.. Pro Max తప్ప పెరగని ధరలు.. ఐఫోన్ లవర్స్ కు పండగే!

why apple not hike iPhone 15 smartphone price explained in Telugu

iPhone 15 Lauch and Price: టెక్ లవర్స్ ఎంతోగానే ఇష్టపడే iPhone 15, iPhone 15 Pro, iPhone 15 Pro Max, iPhone 15 Plus ఫోన్లు వచ్చేశాయి. లేటెస్ట్ ఫీచర్లు, కొత్త అప్‌గ్రేడ్‌లతో ఐఫోన్ 15ను ఆపిల్ (Apple) సంస్థ మార్కెట్ లోకి ప్రవేశపెట్టింది. వాచ్ సిరీస్ 9, వాచ్ అల్ట్రా 2 వాచీలను కూడా ఆపిల్ లాంచ్ చేసింది. ప్రస్తుత మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని iPhone 15 ధరల విషయంలో ఆపిల్ కంపెనీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. iPhone 15 Pro Max మినహా మిగతా అన్ని మోడల్స్ రేట్లు పెంచలేదు.

టాప్ ఎండ్ మోడల్ iPhone 15 Pro Max ధర మాత్రమే 100 నుంచి 1,199 డాలర్ల వరకు పెరిగింది. ఇందులో రెండు రెట్లు ఎక్కువగా డేటా స్టోరేజీ ఉండటం గమనార్హం. మనదేశంలో iPhone 15 ధరలు 799 డాలర్లు (రూ.79,900), iPhone 15 Plus ధరలు 899 డాలర్లు(రూ.89,899) నుంచి ప్రారంభవుతాయి. 1 టీబీ హైఎండ్ టాప్ మోడల్ iPhone 15 Pro Max ధర రూ.1,99,900గా ఉంది. 1 టీబీ iPhone 15 Pro మోడల్ ధర రూ.1,84,900గా ఉంది.

iphone15-launch

iphone15-launch

సీ పోర్ట్ తో చార్జింగ్
మొదటిసారిగా USB టైప్-C పోర్ట్‌ చార్జింగ్ తో ఐఫోన్లను తయారు చేయడం విశేషం. యూరోపియన్ యూనియన్ ఆదేశాలతో దిగివచ్చిన యాపిల్ సంస్థ ఎట్టకేలకు సీ పోర్ట్ చార్జింగ్ తో ఐఫోన్లను విడుదల చేసింది. అయితే యూజర్లు తమ ఎయిర్‌పాడ్‌లు తాజా ఐఫోన్‌ల మాదిరిగానే అదే కనెక్టర్‌ కావాలనుకుంటే మాత్రం కొత్త పెయిర్ కోసం 249 డాలర్లు(రూ. 20650) ఖర్చు చేయాల్సి ఉంటుంది. పాత లైట్నింగ్ ఛార్జర్‌లను ఉపయోగించాలనుకుంటే 29 డాలర్లతో (రూ. 2405) Apple నుండి అడాప్టర్‌ను కొనుగోలు చేయవచ్చు.

ఆపిల్ సంస్థకు చైనా సెగ
లేటెస్ట్ ఐఫోన్ల ధరలు పెద్దగా పెరగకపోవడంతో యూజర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ధరలు పెంచకపోవడానికి వేరే కారణాలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ఒడిదుడుకుల్లో ఉంది. ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్(IDC) లెక్కల ప్రకారం గత త్రైమాసికంలో స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్‌లు దాదాపు 7% పడిపోయాయి. హువాయ్ టెక్నాలజీ నుంచి పోటీ, ఐఫోన్లపై చైనా నిషేధం కారణంగా ఆపిల్ సంస్థకు సెగ తాకింది. ఈ నేపథ్యంలో కొత్తగా విడుదల చేసిన ఐఫోన్ల ధరలు పెంచలేదని ఇండస్ట్రీ ఎక్ప్ ఫర్ట్స్ పేర్కొంటున్నారు.

US వెలుపల పెరిగిన ధరలు
iPhone 14 Pro Max తో పోల్చుకుంటే iPhone 15 Pro Max ధర దాదాపు 10 శాతం మాత్రమే పెరిగింది. అయితే ఇది గతంలో అందించిన 128 గిగాబైట్‌లతో పోలిస్తే 256 గిగాబైట్ల డేటా నిల్వను కలిగి ఉంది. అయితే US వెలుపల ఐఫోన్ల ధరలు బాగానే పెరిగాయి. ముఖ్యంగా కెనడాలో iPhone 15 Pro ధర 50 డాలర్లు, iPhone 15 Pro Max ప్రైస్ 200 డాలర్లు పెరిగింది. ఇండియాలో ప్రో మాక్స్ ధర దాదాపు 14% పెరిగింది. కొన్ని దేశాల్లో మాత్రం ఐఫోన్ల ధరలు తగ్గాయి. UKలో, iPhone 15 Pro, Pro Max ధరలు అంతకుముందు మోడల్స్ కంటే 100 పౌండ్లు (125 డాలర్లు) తక్కువగా ఉన్నాయి.

Also Read: నోకియా X30 5G ఫోన్ భారీగా తగ్గిందోచ్.. రూ. 12వేలు డిస్కౌంట్.. కొత్త ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు..!

రెండు కొత్త స్టోరేజ్ ప్లాన్స్
iPhoneధరలు పెంచనప్పటికీ అదనపు సేవలు, యాక్సెసరీస్ నుంచి ఆదాయాన్ని అందుకునేలా ఆపిల్ ప్లాన్ చేసింది. దీనిలో భాగంగా రెండు కొత్త స్టోరేజ్ టైర్‌లను రూపొందించింది. 6-టెరాబైట్ స్టోరేజ్ కోసం నెలకు 30 డాలర్లు, 12-టెరాబైట్ స్టోరేజ్ కోసం నెలకు 60 డాలర్లతో వీటిని ప్రవేశపెట్టింది. టాప్-ఎండ్ iCloud ప్లాన్ 2-టెరాబైట్ స్టోరేజ్ కోసం 10 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. iPhone 15 Pro, Pro Max యూజర్లు స్పీడ్ గా డేటాను ట్రాన్స్ ఫర్ చేయాలనుకుంటే వారు కొత్త కేబుల్ తీసుకోవాల్సి ఉంటుంది. దీన్ని ఆపిల్ 69 డాలర్లకి విక్రయిస్తోంది.

Also Read: ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్.. ఐఫోన్ 15 లాంచ్‌కు ముందే ఆపిల్ అదిరే ఆఫర్.. డోంట్ మిస్..!

సెప్టెంబర్ 22 నుంచి సేల్స్
లేటెస్ట్ గా లాంచ్ చేసిన iPhone 15 దక్కించుకోవాలంటే సెప్టెంబర్ 22 వరకు ఆగాల్సిందే. ఎందుకంటే అదే రోజు నుంచి సేల్స్ మొదలవుతాయి. ఈ నెల నుంచి ప్రిబుకింగ్స్ ప్రారంభమవుతాయి.