Nipah in Kerala : కేరళలో నిపా వైరస్ కలవరం…పెరుగుతున్న కేసులు

కేరళ రాష్ట్రంలో నిపా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు కలవరపడుతున్నారు. నిపా వైరస్ సోకిన రోగితో సన్నిహితంగా ఉన్న 24 ఏళ్ల ఆరోగ్య కార్యకర్తకు ఈ వైరస్ సోకిందని పరీక్షల్లో తేలింది. నిపా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఐదుకి పెరిగింది....

Nipah in Kerala : కేరళలో నిపా వైరస్ కలవరం…పెరుగుతున్న కేసులు

Nipah in Kerala

Nipah in Kerala : కేరళ రాష్ట్రంలో నిపా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు కలవరపడుతున్నారు. నిపా వైరస్ సోకిన రోగితో సన్నిహితంగా ఉన్న 24 ఏళ్ల ఆరోగ్య కార్యకర్తకు ఈ వైరస్ సోకిందని పరీక్షల్లో తేలింది. నిపా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఐదుకి పెరిగింది. (Nipah in Kerala) దీంతో ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి కేరళ రాష్ట్రప్రభుత్వం కంటైన్ మెంటు జోన్లను ఏర్పాటు చేసింది. నిపా వైరస్ సోకిన రోగుల కాంటాక్ట్ లిస్టులో 700 మంది ఉన్నారని, ఇందులో 77 మంది హైరిస్క్ కేటగిరిలో ఉన్నారని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. (5 cases 700 people on contact list) నిపా వైరస్ సోకిన రోగులు వారి ఇళ్లలోనే ఉండాలని వైద్యాధికారులు సూచించారు.

Ramdev : రాజస్థాన్‌లో రామ్‌దేవ్‌పై పోలీసు కేసు

మరణించిన నిపా రోగుల మార్గాల్లో కూడా ప్రజలు తిరగవద్దని అధికారులు కోరారు. కోజికోడ్‌లో పండుగలు, ఫంక్షన్లలో పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడడాన్ని నిషేధిస్తూ ఆంక్షలు విధించారు. కోజికోడ్ జిల్లాలోని వడకర తాలూకాలోని తొమ్మిది పంచాయతీల్లోని 58 వార్డులను కంటైన్‌మెంట్ జోన్‌లుగా ప్రకటించారు. ఈ జోన్లలో నిత్యావసర వస్తువులు విక్రయించే దుకాణాలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేయడానికి అనుమతిస్తారు.

Jammu and Kashmir : అనంత్ నాగ్ ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఆర్మీ అధికారులు, డీఎస్పీ మృతి

కంటైన్‌మెంట్ జోన్ల గుండా జాతీయ రహదారులపై తిరిగే బస్సులు లేదా వాహనాలు నిపా ప్రభావిత ప్రాంతాల్లో ఆగకూడదని ఆదేశించారు. కోజికోడ్ నగరంలో ఈ వైరస్ ప్రభావంతో బాధపడుతున్న 9 ఏళ్ల బాలుడు చికిత్స పొందుతున్నాడు. కోజికోడ్ జిల్లాలో ప్రారంభమైన ఈ వైరస్ కేరళ మొత్తం వ్యాపించే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్‌ఓ, ఐసిఎంఆర్ హెచ్చరించాయని మంత్రి వీణా జార్జ్ చెప్పారు. ఈసారి కేరళలో కనుగొన్న నిపా జాతి బంగ్లాదేశ్ వేరియంట్ అని, దీని వల్ల మరణాల రేటు ఎక్కువగా ఉంటుందని ఈ జాతి వైరస్ మనిషి నుంచి మనిషికి వ్యాపిస్తుందని మంత్రి చెప్పారు.

Heavy Rains : తెలంగాణలో రాగల మూడు రోజులు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరికలు

నిపా అనేది జూనోటిక్ వైరస్, ఇది సోకిన జంతువులు లేదా కలుషితమైన ఆహారం నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. ఆపై ఈ వైరస్ సోకిన వ్యక్తి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. జ్వరం, తలనొప్పి, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వాంతులు వంటి లక్షణాలతో మెదడు వాపుగా మారి బ్రెయిన్ డెత్‌కు దారితీస్తాయని వైద్యులు చెప్పారు.కేరళలో నిపా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాను ఆ రాష్ట్ర సర్కారు అప్రమత్తం చేసింది. కన్నడ జిల్లాలోకి వచ్చే గూడ్స్ వాహనాలను తనిఖీ చేసేందుకు సరిహద్దు పాయింట్ల వద్ద చెక్‌పోస్టులను తెరవాలని కర్ణాటక ఆరోగ్య శాఖ పోలీసులను కోరింది. కేరళ నుంచి రాష్ట్రంలోకి వచ్చే పండ్లను తనిఖీ చేయాలని పోలీసులను ఆదేశించారు.