Bigg Boss 7 Day 15 : నామినేషన్స్ ఎపిసోడ్ మరీ ఇంత చప్పగానా? ఈ వారం నామినేషన్స్ లో ఎవరెవరు ఉన్నారు?

నిన్నటి నామినేషన్స్ ఎపిసోడ్ చాలా చప్పగా సాగింది. ఒక్క దామిని, ప్రిన్స్ యావర్ మాత్రమే ఫైర్ అయ్యి కాసేపు తిట్టుకున్నారు. మిగిలిన వాళ్లంతా ఏదో నామమాత్రంగా ఫైర్ అయి సింపుల్ గా నామినేషన్స్ తేల్చేశారు.

Bigg Boss 7 Day 15 : నామినేషన్స్ ఎపిసోడ్ మరీ ఇంత చప్పగానా? ఈ వారం నామినేషన్స్ లో ఎవరెవరు ఉన్నారు?

Bigg boss 7 Day 15 Nominations Full List here which contestants in nominations this week

Bigg Boss 7 Day 15 :  ఆదివారం వీకెండ్ ఎపిసోడ్ ఫన్, ఎలిమినేషన్స్ తో సాగిపోయింది. రెండో వారం షకీలా బయటకు వెళ్ళిపోయింది.మూడో వారం మొదలవ్వగానే మొదటి రోజే నామినేషన్స్ అన్ని చేసేశారు. నామినేషన్స్ అంటే హడావిడి ఉంటుంది, ఒకరిని ఒకరు తిట్టుకుంటారు, ఒకరి మీద ఒకరు ఫైర్ అవుతారు. కానీ నిన్నటి నామినేషన్స్ ఎపిసోడ్ చాలా చప్పగా సాగింది. ఒక్క దామిని, ప్రిన్స్ యావర్ మాత్రమే ఫైర్ అయ్యి కాసేపు తిట్టుకున్నారు. మిగిలిన వాళ్లంతా ఏదో నామమాత్రంగా ఫైర్ అయి సింపుల్ గా నామినేషన్స్ తేల్చేశారు.

ఈసారి ఒక్కో కంటెస్టెంట్ నామినేట్ చేయాలనుకునే ఇద్దరి ఫేస్ మీద ఫోమ్ స్ప్రే కొట్టాలని బిగ్‌బాస్ చెప్పాడు. మొదట ప్రియాంక రాగా ప్రిన్స్ యావర్, గౌతమ్ లని నామినేట్ చేసింది. దీంతో యావర్ సరైన రీజన్ కాదంటూ ఫైర్ అయ్యాడు. అనంతరం ప్రశాంత్ వచ్చి తేజ, దామినిలని నామినేట్ చేశాడు. అయితే ప్రశాంత్ చెప్పేవి సిల్లీ రీజన్స్ గా ఉన్నాయని బిగ్‌బాస్ ప్రశాంత్ ని తిట్టాడు. అనంతరం శోభాశెట్టి.. శుభశ్రీ, రతికలను నామినేట్ చేసింది. అమర్ దీప్.. గౌతమ్, శుభశ్రీలను నామినేట్ చేశాడు. రతిక.. శుభశ్రీ, గౌతమ్ లను నామినేట్ చేసింది. తేజ.. ప్రశాంత్, గౌతమ్ లను నామినేట్ చేశాడు. యావర్.. ప్రియాంక, దామిని లను నామినేట్ చేయడంతో దామిని – యావర్ మధ్య కాసేపు గొడవ జరిగింది.దామిని.. యావర్, శుభశ్రీలను నామినేట్ చేసింది. గౌతమ్.. రతిక, అమర్ దీప్ లను నామినేట్ చేశాడు. చివరగా శుభశ్రీ.. తేజ, ప్రియాంకలను నామినేట్ చేసింది.

Bigg Boss 7 Day 14 : బిగ్‌బాస్‌లో కట్టప్ప ఎవరు? భళ్లాలదేవ ఎవరు?.. మళ్ళీ లేడి కంటెస్టెంట్‌నే ఎలిమినేట్ చేసిన బిగ్‌బాస్..

అయితే చివర్లో మళ్ళీ బిగ్‌బాస్ ఎంట్రీ ఇచ్చి శివాజీ, సందీప్ ల దగ్గర పవరాస్త్ర ఉండటంతో, దానిని వాడి నామినేషన్స్ లో నిలిచిన వాళ్ళల్లో ఒకర్ని తప్పించి మీరు ఇద్దరూ కలిసి ఇంకొకరిని నామినేట్ చేయాలి అని చెప్పాడు. దీంతో నామినేషన్స్ లో నిలిచిన తేజని సేవ్ చేసి, అతడి ప్లేస్ లో అమర్ దీప్ ని నామినేట్ చేశారు. ఇక మొత్తంగా ఈ వారం నామినేషన్స్ లో శుభశ్రీ, గౌతమ్, ప్రియాంక, దామిని, రతిక, యావర్, అమర్ దీప్ నిలిచారు. మరి వీళ్లల్లో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.