Actress Abhinaya : లవ్, మ్యారేజ్ గురించి నటి అభినయ ఏం చెప్పిందో తెలుసా?

నటి అభినయ తన అభినయంతో అటు తమిళ్, ఇటు తెలుగు ప్రేక్షకులు దగ్గరయ్యారు. హీరో విశాల్‌తో అభినయ పెళ్లంటూ ఆ మధ్య రూమర్లు వచ్చాయి. అసలు ప్రేమ, పెళ్లి గురించి అభినయ ఏం చెప్పింది?

Actress Abhinaya : లవ్, మ్యారేజ్ గురించి నటి అభినయ ఏం చెప్పిందో తెలుసా?

Actress Abhinaya

Actress Abhinaya : నటి అభినయ అటు సౌత్‌తో పాటు ఇటు తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి. శంభో శివ శంభో సినిమాలో మూగమ్మాయి పాత్రలో నటించిన అభినయను చూసి నిజంగానే ఆమెకు మాటలు రావని, వినికిడి లేదని తెలిసి అందరూ షాకయ్యారు. తరువాత తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ అభినయ పేరు తెచ్చుకుంటున్నారు. అభినయకు కోలీవుడ్ స్టార్ విశాల్‌కు పెళ్లంటూ కొంతకాలంగా పుకార్లు హల్చల్ చేస్తున్నాయి. ఈ వార్తల్లో నిజమెంత? ప్రేమ పెళ్లి గురించి అభినయ ఉద్దేశం ఏంటి?

AMB Cinemas : కర్ణాటకలో అతిపెద్ద థియేటర్ ఇప్పుడు మహేష్ బాబుది.. AMB సినిమాస్ త్వరలో బెంగళూరులో..

అభినయ పేరుకి తగ్గట్లే తన అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. తెలుగులో కింగ్, దమ్ము, ఢమరుకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సీతారామం, ధృవ సినిమాల్లో నటించారు. మాటలు రాకపోయినా, వినికిడి లేకపోయినా తన నటనతో అందరి మనసుని కట్టిపడేసే ఈ నటి తన కెరియర్ గురించి, ప్రేమ, పెళ్లి గురించి ఇటీవల మీడియాతో షేర్ చేసుకున్నారు. యాక్టింగ్, ఫ్యాషన్ డిజైనింగ్ పట్ల మక్కువతో అభినయ ఎంతో ఇష్టంగా నేర్చుకున్నారట. నెగెటివిటీ జీవితాన్ని స్పాయిల్ చేస్తుందని.. మనల్ని ఎవరైనా తక్కువ చేస్తున్నారంటే మనలో ఏదో పవర్ ఉందని తెలుసుకోవాలని అభినయ చెప్పారు.

అభినయ తన కెరియర్ మొదట్లో మాట్లాడేవారు లేక చాలా ఇబ్బందులు పడ్డారట. అలాంటి సమయంలో యాక్టింగ్ మీదనే ఫోకస్ చేసి ముందుకు వెళ్లానని చెప్పారు. ఈరోజు మాట్లాడటానికి చాలామంది ఉన్నారని.. ఎవరేమన్నా పట్టించుకోనని.. జీవితంలో ఎదురైన ప్రతిదానిని యాక్సెప్ట్ చేస్తూ ముందుకు వెళ్లిపోవాలని చెప్పారు.

Pooja Bhatt : తండ్రితో లిప్ లాక్.. 30 ఏళ్ళ తర్వాత క్లారిటీ ఇచ్చిన నటి..

అభినయ వ్యక్తిగత జీవితానికి వస్తే హీరో విశాల్‌తో ఆమెకు పెళ్లంటూ రూమర్లు వచ్చాయి. తను విశాల్ వీరాభిమానిని అని.. ఆయనంటే తనకు చాలా ఇష్టమని ఓ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో అభినయ చెప్పారు. దీంతో వీరిద్దరి మధ్య ఏం లేదని జనాలు క్లారిటీకి వచ్చారు. ఇక రీసెంట్ ఇంటర్వ్యూలో అభినయ ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికరమైన విషయం చెప్పారు. తనకు చాలా ప్రపోజల్స్ వస్తుంటాయని.. చాలామంది పెళ్లి చేసుకుంటామని అడుగుతుంటారని చెప్పారు. అదంతా టైమ్ వేస్ట్ అని ఆమె తీసిపారేసారు. కమ్యూనికేషన్, అర్ధం చేసుకోవడం అనేది ప్రేమ, పెళ్లిలో చాలా అవసరం అంటూ అభినయ అభిప్రాయపడ్డారు. అభినయ తను నేర్చుకున్న సైన్ లాంగ్వేజ్ ద్వారా తన అభిప్రాయాలు చెబుతుంటారు.