Ram Gopal Varma : ఓ అమ్మాయి కోసం వ‌ర్మ ఆరాటం.. పేరు చెప్పాలంటూ ట్వీట్‌.. వైర‌ల్‌

వ‌ర్మ ఓ వీడియోను పోస్ట్ చేశాడు. అందులో ఓ ప‌సుపు రంగు శారీ క‌ట్టుకున్న అమ్మాయి కెమెరాతో ఫోటోలు తీస్తూ ఉంది. ఆమెపై ఆర్‌జీవీ మ‌న‌సు పారేసుకున్నాడో లేదంటే త‌న సినిమాలో ఏదైన పాత్ర‌కు ఆమె స‌రిపోతుంద‌ని భావించాడో తెలియ‌దు గానీ..

Ram Gopal Varma : ఓ అమ్మాయి కోసం వ‌ర్మ ఆరాటం.. పేరు చెప్పాలంటూ ట్వీట్‌.. వైర‌ల్‌

Ram Gopal Varma Shares a video

Ram Gopal Varma Tweet : రామ్ గోపాల్ వ‌ర్మ‌(Ram Gopal Varma) ప‌రిచ‌యం చేయాల్సిన ప‌ని లేదు. అభిమానులు ముద్దుగా ఆర్‌జీవీ అని పిలుచుకుంటారు. ఒక‌ప్పుడు త‌న సినిమాల‌తో అంద‌రి నోళ్ల‌లో నానిన వ‌ర్మ‌.. ఇప్పుడు మాత్రం ఎక్కువ‌గా వివాదాలు, కాంట్ర‌వ‌ర్సీల‌తోనే వార్త‌ల్లో నిలుస్తున్నాడు. ఎవ్వ‌రు ఏమ‌నుకున్నా నేను ప‌ట్టించుకోను నాకు న‌చ్చినట్లు నేను జీవిస్తాను అని చెప్పుకునే వ‌ర్మ సోష‌ల్ మీడియాలో రోజు ఏదో ఒక పోస్ట్ పెడుతూనే ఉంటారు. తాజాగా అత‌డు చేసిన ఓ ట్వీట్ వైర‌ల్‌గా మారింది.

వ‌ర్మ ఓ వీడియోను పోస్ట్ చేశాడు. అందులో ఓ ప‌సుపు రంగు శారీ క‌ట్టుకున్న అమ్మాయి కెమెరాతో ఫోటోలు తీస్తూ ఉంది. ఆమెపై ఆర్‌జీవీ మ‌న‌సు పారేసుకున్నాడో లేదంటే త‌న సినిమాలో ఏదైన పాత్ర‌కు ఆమె స‌రిపోతుంద‌ని భావించాడో తెలియ‌దు గానీ.. ఈ వీడియోను పోస్ట్ చేసిన వ‌ర్మ‌ అందులో ఉన్న అమ్మాయి ఎవ‌రో చెప్పాల‌ని నెటీజ‌న్లు అడిగాడు. ఇంకేముంది ఆ అమ్మాయి ఎవ‌రో క‌నుక్కునే ప‌నిలో ఉన్నారు నెటీజ‌న్లు.

వ‌ర్మ చేసిన ఈ పోస్ట్‌పై కొంద‌రు ఫ‌న్నీగా కామెంట్లు చేస్తుండ‌గా ఇంకొంద‌రు ఆమె పేరు ఇదేనంటూ ఓ పేరును ట్రెండ్ చేస్తున్నారు. ఆమె పేరు శ్రీల‌క్ష్మీ స‌తీశ్ అని అంటున్నారు. ఆమె ఏం చేస్తుంటుంది అన్న వివ‌రాలు తెలియ‌రాలేదు. వ‌ర్మ కంట్లో ప‌డింది అంటే తొంద‌ర‌లోనే ఆమె స్టార్ హీరోయిన్ అవ్వ‌డం ఖాయ‌మైని మ‌రికొంద‌రు కామెంట్లు పెడుతున్నారు. మరీ ఈ బ్యూటీ ఎవ‌రు, ఏం చేస్తుంటుంది..? వ‌ర్మ ఎందుకు ఆమె వివ‌రాలు అడిగాడు..? అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

2018 Movie : నిన్న ఇంటర్నేషనల్ అవార్డు.. నేడు ఆస్కార్‌కి ఎంపిక..