TRS leaders: ఎన్నికల ముందు బీఆర్ఎస్‌కు షాక్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన మైనంపల్లి, వేముల వీరేశం.. ఇంకా..

ఈ తెలంగాణ నేతలు అందరూ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్ రావు ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో కలిసి ఢిల్లీకి వెళ్లి ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

TRS leaders: ఎన్నికల ముందు బీఆర్ఎస్‌కు షాక్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన మైనంపల్లి, వేముల వీరేశం.. ఇంకా..

MLA Mynampalli Hanmantha Rao

Congress: తెలంగాణ ఎన్నికల ముందు బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. పలువురు బీఆర్ఎస్ నేతలు ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో బీఆర్ఎస్ నేతలు మైనంపల్లి హనుమంతరావు, రోహిత్, వేముల వీరేశం, కుంభం అనిల్ కుమార్ కాంగ్రెస్‌లో చేరారు.

ఈ తెలంగాణ నేతలు అందరూ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్ రావు ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో కలిసి ఢిల్లీకి వెళ్లి ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఖర్గే నివాసంలో ఈ చేరికలు జరిగాయి. ఆ సమయంలో ఖర్గే నివాసం వద్దే షబ్బీర్ అలీ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహా తెలంగాణ బీసీ నేతలు కూడా ఉన్నారు.

మల్కాజ్ గిరి స్థానం నుంచి పోటీ చేస్తానని మైనం పల్లి హనుమంతరావు అంటున్నారు. అలాగే, తన కుమారుడు రోహిత్ కు మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని పట్టుబట్టి కూర్చున్నారు. బీఆర్ఎస్ నుంచి రోహిత్ కు టికెట్ దక్కకపోవడంతో ఆయన కాంగ్రెస్ లో చేరారు.

కుంభం అనిల్ కుమార్ రెడ్డి భువనగిరి నేత. రెండు నెలల క్రితమే ఆయన కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరిన విషయం విదితమే. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వచ్చారు. అప్పట్లో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కుంభం అనిల్ కుమార్ రెడ్డి మధ్య విభేదాలు వచ్చినట్లు ప్రచారం జరిగింది.

Rahul Gandhi: కిటికీలు, తలుపులు చేసే పనుల్లో మమేకమైన రాహుల్ గాంధీ