Ravi babu: చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించిన టాలీవుడ్ నటుడు.. వీడియో విడుదల

రాజకీయాల్లో ఎత్తులు పైఎత్తులు సహజం.. కానీ, 73ఏళ్ల వయస్సు కలిగిన వ్యక్తిని జైల్లో పెట్టి హింసించడం ఎలాంటి ఎత్తు పైఎత్తు అవుతుందో అర్థం కావడం లేదని రవిబాబు అన్నారు.

Ravi babu: చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించిన టాలీవుడ్ నటుడు.. వీడియో విడుదల

Ravi babu

Actor Ravi babu : ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రాజమండ్రి జైలులో రిమాండ్ లో ఉన్న విషయం తెలిసిందే. చంద్రబాబు అరెస్ట్ పట్ల టీడీపీ శ్రేణులు.. వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ కక్షతో అక్రమంగా చంద్రబాబును అరెస్టు చేశారని, రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు నిరసనలు తెలుపుతున్నారు. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సైతం చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను తెలిపారు. తాజాగా టాలీవుడ్ నటుడు, దర్శకుడు రవిబాబు.. చంద్రబాబు అరెస్టును ఉద్దేశిస్తూ తన ఇన్ స్టాగ్రామ్‌లో వీడియోను విడుదల చేశారు.

Also Read : పాల ప్యాకెట్లు పేలిపోతున్నాయ్..! సీఎం జగన్‌పై మండిపడ్డ లోకేశ్.. ట్విటర్‌లో ఉబ్బిన పాల ప్యాకెట్ల వీడియో

వీడియోలో రవిబాబు మాట్లాడుతూ.. దయచేసి చంద్రబాబును వదిలిపెట్టాలని కోరారు. జీవితంలో ఏదీ శాశ్వతం కాదు.. సినిమావాళ్ల గ్లామర్ కానీ, రాజకీయ నాయకుల పవర్ కానీ.. అస్సలు శాశ్వతం కాదని రవిబాబు అన్నారు. చంద్రబాబు నాయుడుకు ఇప్పడు వచ్చిన కష్టాలు కూడా శాశ్వతం కాదని అన్నారు. చంద్రబాబు ఏదైనా పనిచేసే ముందు అందరినీ సంప్రదించి ఎవరికీ ఇబ్బందులు కలగకుండా నిర్ణయం తీసుకుంటారు. భూమి మీద ఈరోజు లాస్ట్ రోజు అని తెలిసినా కూడా ప్రశాంతంగా కూర్చొని వచ్చే 50 ఏళ్లకు సోషల్ డెవలప్‌మెంట్ కోసం ఆలోచిస్తారని రవిబాబు అన్నారు. ఆయన డబ్బుకోసం కక్కుర్తిపడే వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తిని సరియైన ఆధారాలు కూడా లేకుండా జైల్లో పెట్టి ఎందుకు ఇబ్బంది పెడుతున్నారో అర్థం కావటం లేదని రవిబాబు అన్నారు.

Also Read : Naveen Chandra : నవీన్ చంద్ర భార్య గురించి తెలుసా? తను కూడా సినిమా ఇండస్ట్రీనే.. త్వరలో డైరెక్టర్ గా?

రాజకీయాల్లో ఎత్తులు పైఎత్తులు సహజం.. కానీ, 73 ఏళ్ల వయస్సు కలిగిన వ్యక్తిని జైల్లో పెట్టి హింసించడం ఎలాంటి ఎత్తు పైఎత్తు అవుతుందో అర్థం కావడం లేదని రవిబాబు అన్నారు. మీరు ఏ పవర్‌ను అయితే వాడి చంద్రబాబును జైల్లో పెట్టారో.. అదే పవర్‌ను ఉపయోగించి ఆయన్ను వదిలేయాలని, మీరు చిటికేస్తే అది జరిగిపోతుందని అందరికీ తెలుసని రవిబాబు అన్నారు. చంద్రబాబును బయటఉంచి విచారణ చేయొచ్చని, ఆయన ఈ దేశాన్ని వదిలి విదేశాలకు పారిపోయే వ్యక్తి కాదని రవిబాబు అన్నారు. చరిత్ర మిమ్మల్ని ఎలా గుర్తుంచుకోవాలని అనుకుంటున్నారు? కక్షతో రగిలిపోయే కసాయి వాళ్ల లాగానా? జాలి మనస్సు, విలువలు కలిగిన మంచి నాయకుల లాగానా?. దయచేసి చంద్రబాబును వదిలిపెట్టండి, నాలాగా ఎంతో మంది మీపట్ల కృతజ్ఞతను కలిగి ఉంటారని రవిబాబు విజ్ఞప్తి చేశారు.

 

View this post on Instagram

 

A post shared by Ravi Babu (@ravibabuofficial)