Nara Lokesh : పాల ప్యాకెట్లు పేలిపోతున్నాయ్..! సీఎం జగన్‌పై మండిపడ్డ లోకేశ్.. ట్విటర్‌లో ఉబ్బిన పాల ప్యాకెట్ల వీడియో

పసి పిల్లలకిచ్చే పాలనూ జగన్ వదలట్లేదు. రాష్ట్రంలో జె-బ్రాండ్ల మద్యంతో లక్షలాది మహిళల తాళిబొట్లు తెంచుతున్న సైకో జగన్ అవినీతిదాహం పరాకాష్టకు చేరింది.

Nara Lokesh : పాల ప్యాకెట్లు పేలిపోతున్నాయ్..! సీఎం జగన్‌పై మండిపడ్డ లోకేశ్.. ట్విటర్‌లో ఉబ్బిన పాల ప్యాకెట్ల వీడియో

Nara Lokesh

Updated On : September 30, 2023 / 10:30 AM IST

Nara LoKesh: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టుతో ఏపీ రాజకీయాలు హీటెక్కాయి. టీడీపీ వర్సెస్ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. మరోవైపు చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఏపీ వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, ఆయన సతీమణి నారా బ్రాహ్మణి ‘మోత మోగిద్దా’ పేరుతో నిరసనకు పిలుపునిచ్చారు. జైలులో ఉన్న చంద్రబాబుకు సంఘీభావంగా టీడీపీ ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. శనివారం రాత్రి 7 నుంచి 7.05 గంటల వరకూ ప్లేట్‌పై గరిటెతో కొట్టడం, విజిల్ వేయడం, రోడ్డుపై ఉంటే హారన్ కొట్టడం ద్వారా సీఎం జగన్‌మోహన్ రెడ్డి అధికార మత్తు వదిలేలా మోత మోగించాలని లోకేశ్ పార్టీ శ్రేణులను, ప్రజలను కోరారు. ఇదిలాఉంటే శనివారం ఉదయం నారా లోకేశ్ ట్విటర్‌ వేదికగా సీఎం జగన్ ను విమర్శిస్తూ పాల ప్యాకెట్లు ఉన్న ఓ వీడియోను షేర్ చేశారు.

Read Also : Nara Brahmani : బాబుకు మద్దతుగా నిరసన కార్యక్రమాలకు నారా బ్రాహ్మణి పిలుపు

పసి పిల్లలకిచ్చే పాలనూ వదలవా సీఎం జగన్ అంటూ ట్విటర్ వేదికగా లోకేశ్ విమర్శలు గుప్పించారు. పసి పిల్లలకిచ్చే పాలనూ జగన్ వదలట్లేదు. రాష్ట్రంలో జె-బ్రాండ్ల మద్యంతో లక్షలాది మహిళల తాళిబొట్లు తెంచుతున్న సైకో జగన్ అవినీతిదాహం పరాకాష్టకు చేరింది. పాపపు సొమ్ముకోసం పసి పిల్లలు, బాలింతలకు ఇచ్చే పాలనుసైతం కల్తీచేస్తూ కాలకూట విషంగా మార్చారు. అంగన్వాడీ కేంద్రాలకు ఇప్పటి వరకు టెట్రా ప్యాకుల్లో సరఫరా చేస్తున్న పాలను తాజాగా సైకో జగన్ ముఖారవిందంతో లీటరు పాలిథిన్ పౌచుల్లో సరఫరా చేస్తున్నారు.

Read Also : Nara Lokesh: ఇక సమయం ఆసన్నమైంది.. శనివారం రాత్రి అందరం కలిసి మోత మోగిద్దాం: లోకేశ్, బ్రాహ్మణి పిలుపు

ఈనెల 3వతేదీన ప్యాక్ చేసినట్లుగా చెప్పబడుతున్న ఈ పాలప్యాకెట్లకు డిసెంబర్ 2వతేదీవరకు ఎక్స్పైరీ డేట్ ఉన్నా.. సరఫరా చేసిన రెండురోజులకే గ్యాస్ బాంబుల్లా ఉబ్బి పేలిపోతున్నాయి. ఇవి చూశాక రక్తం రుచిమరిగిన మృగానికి, అడ్డగోలు సంపాదనకు అలవాటుపడిన జగన్ రెడ్డికి పెద్ద తేడా ఏమీ లేదనిపిస్తోందని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉబ్బిపోయిన పాలపాకెట్ల‌కు సంబంధించిన వీడియోను తన ట్వీట్‌కు నారా లోకేశ్ జత చేశారు.