Nara Lokesh: ఇక సమయం ఆసన్నమైంది.. శనివారం రాత్రి అందరం కలిసి మోత మోగిద్దాం: లోకేశ్, బ్రాహ్మణి పిలుపు

రేపు రాత్రి 7 గంటల నుంచి 7.05 గంటల మధ్య 5 నిమిషాల పాటు 5 కోట్ల ఆంధ్రులు ఒక్కటిగా మోత మోగించాలని చెప్పారు.

Nara Lokesh: ఇక సమయం ఆసన్నమైంది.. శనివారం రాత్రి అందరం కలిసి మోత మోగిద్దాం: లోకేశ్, బ్రాహ్మణి పిలుపు

Nara Brahmani

Updated On : September 29, 2023 / 5:00 PM IST

Nara Brahmani: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి అరెస్ట్‌ను ఖండిస్తూ మోత మోగిద్దాం పేరిట నిరసన కార్యక్రమానికి ఆయన కుమారుడు, కోడలు నారా లోకేశ్, బ్రాహ్మణి పిలుపునిచ్చారు.

‘అరెస్టు చేస్తే ప్రజాగ్రహం ఎలా ఉంటుందో చూపిద్దాం. తప్పుడు కేసులు బనాయిస్తే వెనక్కి తగ్గమని నిరూపిద్దాం. నిలువెత్తు నిజాయితీ రూపం, తెలుగు తేజం చంద్రబాబుకి మద్దతుగా తెలుగు వారంతా ఉన్నారని నిరూపించే తరుణం ఇది.

నిష్కళంక రాజకీయ మేరునగధీరుడు చంద్రబాబు నాయుడుకి మద్దతుగా 30వ తేదీ శనివారం రాత్రి 7 గంటల నుంచి 7.05 గంటల మధ్య ఉన్న చోటే మోత మోగించి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాశబ్దం వినిపిద్దాం’ అని లోకేశ్ పిలుపునిచ్చారు.

ప్యాలెస్‌లో ఉన్న సీఎం జగన్‌కి వినిపించేలా ఏదో ఒక రకంగా మోత మోగించాలని బ్రాహ్మణి ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలు తెలిపే నిరసనను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయాలని అన్నారు. నియంత ముందు మొర పెట్టుకుంటే ఫలితం ఉండదని, అధికార మత్తు వదిలేలా మోత మోగించాల్సిందేనని అన్నారు.

రేపు రాత్రి 7 గంటల నుంచి 7.05 గంటల మధ్య 5 నిమిషాల పాటు 5 కోట్ల ఆంధ్రులు ఒక్కటిగా మోత మోగించాలని చెప్పారు. ఇంట్లోనో, ఆఫీసులోనో ఇంకెక్కడ ఉన్నా బయటకొచ్చి గంట లేదా ప్లేట్ మీద గరిటెతో కొట్టండి లేదా విజిల్ వేయండని అన్నారు. రోడ్డు మీద వాహనంతో ఉంటే హారన్ కొట్టాలని చెప్పారు.

Raghu Veera Reddy: చంద్రబాబు అనకొండ కోరల్లో ఇరుక్కున్నారు.. జగన్‌కూ ఇదే పరిస్థితి వస్తుంది.. ఎందుకంటే?: రఘువీరారెడ్డి