Raghu Veera Reddy: చంద్రబాబు అనకొండ కోరల్లో ఇరుక్కున్నారు.. జగన్‌కూ ఇదే పరిస్థితి వస్తుంది.. ఎందుకంటే?: రఘువీరారెడ్డి

టీడీపీ ఎన్ని ఆందోళనలు నిర్వహించినా ప్రయోజనం ఉండబోదని చెప్పారు.

Raghu Veera Reddy: చంద్రబాబు అనకొండ కోరల్లో ఇరుక్కున్నారు.. జగన్‌కూ ఇదే పరిస్థితి వస్తుంది.. ఎందుకంటే?: రఘువీరారెడ్డి

Raghu-Veera Reddy

Updated On : September 29, 2023 / 4:47 PM IST

Chandrababu Arrest: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి అరెస్టుపై సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సత్యసాయి జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… బీజేపీని అనకొండతో పోల్చారు. దాని కోరల్లో చంద్రబాబ బలంగా ఇరుక్కున్నారని చెప్పారు.

ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాకు తెలియకుండా చంద్రబాబు నాయుడుని అరెస్టు చేసే ప్రసక్తే లేదని రఘువీరారెడ్డి అన్నారు. సీఎం జగన్ భుజం మీది నుంచే చంద్రబాబు నాయుడిపై బీజేపీ గురిపెట్టిందని చెప్పారు. చంద్రబాబు నాయుడు అరెస్టు అయిన తర్వాత ఆయన పార్టీ అనేక పార్టీలను కలిసిందని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీని మాత్రం కలవలేదని రఘువీరారెడ్డి అన్నారు. టీడీపీ ఎన్ని ఆందోళనలు నిర్వహించినా ప్రయోజనం ఉండబోదని చెప్పారు. న్యాయస్థానంలోనే టీడీపీ పోరాడాలని అన్నారు. ఏపీలో బీజేపీని బలోపేతం చేయడానికి దివంగత సీఎం ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ప్రకటించారని అన్నారు. ఏపీలో చోటుచేసుకుంటున్న పరిణామాలన్నీ ఇక్కడ బీజేపీ బలపడటానికేనని చెప్పారు. సీఎం జగన్ కి కూడా భవిష్యత్తులో చంద్రబాబు లాంటి పరిస్థితే వస్తుందని అన్నారు.

Nara Lokesh: లోకేశ్‌ను అక్టోబరు 4 వరకు అరెస్టు చేయొద్దన్న ఏపీ హైకోర్టు.. ప్రభుత్వం ఏం చెప్పింది?