Revanth Reddy : కాంగ్రెస్ ను అడ్డుకోవడం నీ వల్ల కాదు.. నీ అయ్య వల్ల కూడా కాదు : రేవంత్ రెడ్డి

లిక్కర్ స్కామ్ లో కవిత రూ.300 కోట్లు వెనకేశారని దేశమంతా చెప్పుకుంటున్న మాటల గురించి చెప్పు అని అన్నారు. భూములు, లిక్కర్ అమ్మితే తప్ప తెలంగాణలో పాలన నడుస్తలేదని కాగ్ కడిగేసిన విషయం గురించి చెప్పు అని సూచించారు.

Revanth Reddy : కాంగ్రెస్ ను అడ్డుకోవడం నీ వల్ల కాదు.. నీ అయ్య వల్ల కూడా కాదు : రేవంత్ రెడ్డి

TPCC president Revanth Reddy (2)

Revanth Reddy – KTR :  మంత్రి కేటీఆర్ ట్వీట్ కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కౌంటర్ ట్వీట్ ఇచ్చారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలను చూసి తండ్రికి చలి జ్వరం పట్టుకుంటే, కొడుకేమో పూర్తిగా మతి తప్పినట్టుగా మాట్లాడుతున్నాడని అన్నారు. నిండా అవినీతిలో మునిగి, నిద్రలో కూడా కమీషన్ల గురించే కలవరించే మీరా కాంగ్రెస్ గురించి మాట్లాడేది? అని ప్రశ్నించారు. పక్క రాష్ట్రంపై నీ గాలి మాటలను కాసేపు పక్కనబెట్టి, తెలంగాణలో మీ కల్వకుంట్ల SCAMILY గురించి చెప్పు అని తెలిపారు.

దళిత బంధులో 30 శాతం కమీషన్లు దండుకుంటున్నామని స్వయంగా మీ అయ్యనే ఒప్పుకున్న సంగతి గురించి చెప్పు అని పేర్కొన్నారు. లిక్కర్ స్కామ్ లో కవిత రూ.300 కోట్లు వెనకేశారని దేశమంతా చెప్పుకుంటున్న మాటల గురించి చెప్పు అని అన్నారు. భూములు, లిక్కర్ అమ్మితే తప్ప తెలంగాణలో పాలన నడుస్తలేదని కాగ్ కడిగేసిన విషయం గురించి చెప్పు అని సూచించారు.

KA Paul : ఆ పార్టీల నుంచి నేతలు ప్రజాశాంతి పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు : కేఏ పాల్

తెలంగాణలో ఎన్ని ప్రభుత్వ భూములను అమ్ముకున్నారో, ఎన్ని ఎకరాలను మీ రియల్ ఎస్టేట్ మాఫియాకు కట్టబెట్టిండ్రో, ఎంత మంది మీ బినామీ బిల్డర్లతో హైదరాబాద్ మాఫియా సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నారో, ఎన్ని లక్షల చదరపు అడుగుల స్థలాలు మీ మాఫియా కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయో? అన్నీ లెక్కలతో సహా తేలుస్తామని చెప్పారు. కాంగ్రెస్ ను అడ్డుకోవడం నీ వల్ల కాదు.. నీ అయ్య వల్ల కూడా కాదన్నారు.