Lucifer 2 : మోహన్‌లాల్ ‘లూసిఫర్‌2 :ఎంపురాన్‌’.. అబ్రహాం ఖురేషి వ‌చ్చేస్తున్నాడు

మల‌యాళ స్టార్ హీరో మోహ‌న్ లాల్ హీరోగా పృథ్వీరాజ్‌ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘లూసిఫర్‌’. ఈ సినిమాకి ప్రీక్వెల్‌ ను ప్ర‌క‌టించింది చిత్ర బృందం.

Lucifer 2 : మోహన్‌లాల్ ‘లూసిఫర్‌2 :ఎంపురాన్‌’.. అబ్రహాం ఖురేషి వ‌చ్చేస్తున్నాడు

Lucifer 2 Empuraan

Lucifer 2 Empuraan : మల‌యాళ స్టార్ హీరో మోహ‌న్ లాల్ (Mohanlal) హీరోగా పృథ్వీరాజ్‌ సుకుమారన్ (Prithviraj Sukumaran) దర్శకత్వంలో వచ్చిన పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘లూసిఫర్‌’(Lucifer). ఈ చిత్రం మ‌ల‌యాళంతో పాటు తెలుగులోనూ మంచి విజ‌యాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమాకి ప్రీక్వెల్‌ ను ప్ర‌క‌టించింది చిత్ర బృందం. అంటే ఇందులో హీరో గతాన్ని ఈ సినిమాకి ముందు పార్ట్ ని చూపించనున్నారు. తాజాగా దీనికి ‘లూసిఫర్ 2 : ఎంపురాన్‌’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఎంపురాన్‌ (Empuraan) అంటే తెలుగులో రాజు కన్నా గొప్పవాడు అని అర్ధం. ఈ చిత్ర షూటింగ్‌ను అక్టోబ‌ర్ 5న ప్రారంభించ‌నున్న‌ట్లు ఓ వీడియో ద్వారా చిత్ర బృందం వెల్ల‌డించింది.

‘లూసిఫర్‌’ చిత్రంలో మోహన్‌లాల్‌ స్టీఫెన్‌ గట్టుపల్లి అనే ఓ రాజకీయ నాయకుడిగా కనిపిస్తాడు. అయితే రాజకీయ నాయకుడు కాకముందు ఈ ప్రపంచాన్నే శాసించే ఓ మాఫియా లీడర్ అబ్రహాం ఖురేషిగా ఉన్నాడు అని క్లైమాక్స్ లో తెలుస్తుంది. లూసిఫర్ సెకండ్ పార్ట్ లో అసలు ఒక సాధారణ వ్యక్తి అయిన స్టీఫెన్‌.. అబ్రహాం ఖురేషి ఎలా అయ్యాడు? అతడు చేసిన పనులు ఏంటి? ఎందుకు రాజకీయ నాయకుడిగా మారాడు అని చూపించనున్నట్లు తెలుస్తుంది.

Bigg Boss 7 : త‌ప్పుచేసిన టేస్టీ తేజ‌.. వీడియో చూపించి మ‌రీ.. మండిప‌డ్డ నాగార్జున‌

ఈ చిత్రాన్ని ఆశీర్వాద్ సినిమాస్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మొదటి భాగంలో నటించిన మంజు వారియర్, టోవినో థామస్, ఇంద్రజిత్ సుకుమారన్ వంటి నటీనటులు ఈ సీక్వెల్‌లో కూడా కనిపించనున్నారు.